ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి బెదిరింపులు - కేసీఆర్​ అన్న కుమారుడిపై మరో కేసు - Another Case on Kanna Rao

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 12:11 PM IST

Another Case Booked on Kanna Rao : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఈసారి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి నగదు, బంగారం కాజేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

another_case_booked_on_kanna_rao
another_case_booked_on_kanna_rao

Another Case Booked on Kanna Rao : ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్​హౌస్​లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్​ పోలీసులు కన్నారావు (Kalvakuntla Kanna Rao) సహా మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కన్నారావు నందిని అనే మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కన్నారావు అరెస్ట్ - చర్లపల్లి జైలుకు తరలింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఓ సమస్య పరిష్కారం కోసం తనకు న్యాయం చేయాలని విజయవర్ధన్​ రావు అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కన్నారావు దగ్గరకు వెళ్లాడు. కన్నారావుకు నందిని అనే మహిళతో పరిచయం ఉంది. అలాగే విజయవర్ధన్​కు నందిని స్నేహితురాలు. విజయవర్ధన్ వద్ద భారీ మొత్తంలో డబ్బు, నగలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె ఎలాగైనా వాటిని కొట్టేయాలని భావించింది. విజయవర్ధన్​ కన్నారావు వద్దకు వెళ్లిన క్రమంలో ఇదే అదునుగా భావించిన నందిని కన్నారావు సాయంతో ఆ ఉద్యోగి వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ విషయం కన్నారావుకు తెలిపింది.

అలా ఓ రోజు విజయవర్దన్​ ను గెస్ట్​హౌస్​కు పిలిపించుకున్న ఆ మహిళ, కన్నారావు సహా మరికొంత మందితో కలిసి అతడిని బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. తన సొమ్ము కోల్పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసునని బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు- నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుక దోపిడి వైఎస్ షర్మిల

Kalvakuntla Kanna Rao Land Grab Case : అంతకు ముందు నగరు శివారు ప్రాంతం మన్నెగూడలోని భూమిని కబ్జా చేశారనే నేపథ్యంలో కన్నారావును పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలు(Charlapalli Jail) కు పంపించారు. 14 రోజుల పాటు మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడికి రిమాండ్​ విధించారు. సురేందర్​ రెడ్డి దగ్గర ఉన్న 2.10 ఎకరాల భూమిని 2013లో చామ సురేశ్​కు రూ.50 లక్షలు తీసుకొని జీపీఏ చేశాడు. ఆ రూ.50 లక్షలు తిరిగి ఇచ్చినప్పుడు భూమి తిరిగి ఇస్తానని ఒప్పంద పత్రం రాసుకున్నారు.

అయితే 2020 వరకు సురేందర్​రెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో సురేశ్​ ఆ భూమిని వేరే వాళ్లకు విక్రయించాడు. ఇలా తనకు చెప్పకుండా చేయడం సురేందర్​రెడ్డికి నచ్చక, ఆ సంస్థపై తరుచూ గొడవకు వెళ్లేవాడు. ఆ ఓఎస్​ఆర్​ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అప్పుడు మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావు వద్దకు వెళ్లారు. అతనితో కోటి రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఆ భూమి మీదకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో పోలీసులు 38 మందిని నిందితులుగా చేర్చారు. అయితే కన్నారావు ఇంకా ఏం అక్రమాలు చేశాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.

అగతవరప్పాడు భూదందా కేసులో కీలక నిందితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.