ETV Bharat / sports

కోహ్లీ భద్రతకు ముప్పు- స్టేడియం వద్ద ఉగ్రవాదులు అరెస్ట్​- RCB ప్రాక్టీస్ క్యాన్సిల్! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:29 PM IST

Virat Kohli Security Issue: ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న అహ్మ‌దాబాద్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నలుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.

Virat Kohli Security
Virat Kohli Security (Source: Associated Press)

Virat Kohli Security Issue: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. లీగ్‌ సెకంఢాప్​ నుంచి గేర్‌ మార్చి దూకుడు పెంచిన ఆర్సీబీ జట్టు మరి కొన్ని గంటల్లో ఎలిమినేటర్‌ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో పోటీ పడనుంది. అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు ముందు ఆర్సీబీ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ ఆడాల్సి ఉంది. కానీ ఆ జట్టు అనూహ్యంగా ప్రాక్టీస్ సెషన్​ను రద్దు చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. ముఖ్యంగా కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇలా చేసినట్లు తెలిసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే ? సోమవారం(మే 20) రాత్రి అహ్మదాబాద్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందింది. వారి దగ్గర నుంచి అధికారులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం గురించి ఆర్సీబీ, రాజస్థాన్‌ జట్లకు పోలీసులు సమాచారమిచ్చారు. దీంతో ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్​ను రద్దు చేసుకుంది.'అరెస్ట్​ విషయం కోహ్లీకి తెలిసింది. అతడు జాతీయ నిధి. విరాట్​ భద్రతే అత్యధిక ప్రాధాన్యం. అందుకే రిస్క్‌ తీసుకోలేమని ఆర్సీబీ యాజమాన్యం చెప్పింది. ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కానీ, రాజస్థాన్‌ టీమ్ మాత్రం య తమ ప్రాక్టీస్‌ చేసింది' అని ఓ పోలీసు అధికారి తెలిపినట్లు ఇంగ్లీష్​ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ వల్ల ఆర్సీబీ ప్లేయర్స్ ఉన్న హోటల్‌ దగ్గర భారీ సెక్యూరిటీని మొహరించారు. ప్రత్యేక ఎంట్రీని కూడా ఏర్పాటు చేశారు. ఐపీఎల్‌ అనుబంధ మీడియా సిబ్బందిని కూడా అనుమతించట్లేదని తెలిసింది. రాజస్థాన్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్​ కోసం ప్రయాణించిన బస్సును కూడా మూడు పోలీసు వాహనాలు ఎస్కార్ట్‌ చేశాయని తెలిసింది. అలానే వారు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనూ మెదానం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మొత్తంగా ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాలు చర్చనీయాంశంగా మారింది.

అసలు కారణం ఇదీ!
అయితే భద్రత ముప్పు వల్లే ప్రాక్టీస్ సెషన్ రద్దైంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. "ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్సీబీ, ఆర్​ఆర్ రెండు జట్లకు గుజరాత్ కాలేజ్ గ్రౌండ్​లో ట్రైనింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాం. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్లే ఆఫ్స్​ మ్యాచ్ కారణంగా అక్కడ ఏర్పాటు చేయడం కుదరలేదు. గుజరాత్ కాలేజ్ గ్రౌండ్​లోని ఓ బిల్డింగ్​లో లోక్ సభ ఎలెక్షన్స్​కు సంబంధించి ఈవీఎమ్​లను ఉన్నందుకు స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. కానీ ఆర్సీబీ హీట్ వేవ్ కారణంగా ప్రాక్టీస్​ సెషన్​ను రద్దు చేసుకుంది. అంతే తప్ప భద్రత ముప్పు వల్ల కాదు" అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.

'T20ల్లోంచి విరాట్​ను తప్పించడమే వాళ్ల పని!' - T20 World Cup

సొంత రికార్డ్​ బ్రేక్ చేసే ఛాన్స్- ఆ ఫీట్​కు అతి చేరువలో విరాట్ కోహ్లీ - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.