ETV Bharat / sports

'ఈ సీజన్​లో మేం సరైన క్రికెట్ ఆడలేదు'- ముంబయి వైఫల్యాలపై హార్దిక్ రియాక్షన్! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 11:48 AM IST

Updated : May 12, 2024, 1:04 PM IST

Hardik Pandya IPL 2024: ఈడెన్ గార్డెన్స్​ వేదికగా శనివారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 18 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓటమి గురించి మాట్లాడాడు.

Hardik Pandya IPL 2024
Hardik Pandya IPL 2024 (Source: Associated Press)

Hardik Pandya IPL 2024: 2024 ఐపీఎల్​లో హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఫ్లేఆఫ్స్​ రేస్ నుంచి అధికారికంగా తప్పుకున్న ముంబయి తాజాగా కోల్​కతాతో మ్యాచ్​లో మరో ఓటమిని మూటగట్టుకుంది. కాగా, ఈ సీజన్​లో ముంబయికి ఇది తొమ్మిదో ఓటమి. ఇక మ్యాచ్​ అనంతరం కెప్టెన్ హార్దిక్ ఈ సీజన్​లో తమ ప్రదర్శన గురించి మాట్లాడాడు.

'బౌలర్లు బాగానే రాణించారు. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. శనివారం మ్యాచ్‌లోనూ అదే జరిగింది. బ్యాటింగ్ విభాగం శుభారంభం ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక పోయాం. గ్రౌండ్ చాలా దారుణంగా మారిపోయింది. వర్షం పడినప్పటికీ బౌలర్లు మంచి ఆటతీరు కనబరిచారు. వాతావరణ పరిస్థితితుల వల్ల బంతి బౌండరీకి చేరుకోగానే తడిసిపోతూ ఉంది. ఇక సీజన్​ ​ ప్రారంభం నుంచి గెలవాలనే తపనతోనే ఆడాం. నాణ్యమైన క్రికెట్ ఆడాలనేదే నా సిద్ధాంతం. కానీ, ఈ సీజన్​లో మేం అదే కోల్పోయాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ఇక ఆఖరి మ్యాచ్​లో బాగా ఆడి సీజన్​ను ఘనంగా ముగిస్తాం' అని అన్నాడు.

శనివారం సాయంత్రం ఈడెన్​ గార్డెన్స్​లో వర్షం పడటం వల్ల మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. దీంతో మ్యాచ్​ను 16ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాండ్యా కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన కేకేఆర్ 16 ఓవర్లలో 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (40 పరుగులు) రాణించాడు. చేధనలో ముంబయి 16 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి (2/17) ముంబయిని దెబ్బకొట్టాడు.

ఇక కెప్టెన్ పాండ్య వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆ సీజన్​లో అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. బ్యాటు, బంతితో పూర్తిగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్​లు ఆడిన పాండ్య 18.18 సగటుతో కేవలం 200 పరుగులే చేశాడు. అటు బంతితోనూ రాణించలేకపోయిన పాండ్య 11 వికెట్లే పడగొట్టాడు. ఇక ఈ సీజన్​లో ఏకంగా 10.59 ఎకనమీతో పరుగులిచ్చుకున్నాడు.

రోహిత్​కు ఇదే లాస్ట్ సీజన్​! - వైరల్ అవుతున్న వీడియో - Rohit Sharma Mumbai Indians

ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లిన కోల్​కతా- ఈడెన్​లో ముంబయిపై గ్రాండ్ విక్టరీ - IPL 2024

Last Updated : May 12, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.