'ఆర్సీబీలో సగం మందికి ఇంగ్లీష్ కుడా రాదు' - IPL 2024 RCB

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 6:40 PM IST

'ఆర్సీబీలో సగం మందికి ఇంగ్లీష్ కుడా రాదు'

IPL 2024 RCB : ప్రతి ఐపీఎల్‌ సీజన్‌ తరహాలోనే ఇప్పుడు కూడా ఆర్సీబీ కప్పు గెలిచే సూచనలు కనిపించడం లేదు. తాజాగా సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమితో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ క్రికెటర్లు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ లోపాలపై మండిపడుతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

IPL 2024 RCB : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎక్కువ ఫ్యాన్‌ బేస్‌ సొంతం చేసుకున్న పాపులర్‌ టీమ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఒకటి. ఈ టీమ్‌లో ఉన్న స్టార్‌ క్రికెటర్‌ల వల్లనే ఆర్సీబీ ఇంత పాపులర్‌ అయింది. మొదటి సీజన్‌ నుంచి ప్రస్తుత ఐపీఎల్‌ 17 సీజన్‌ వరకు ఆర్సీబీలో స్టార్‌ క్రికెటర్‌లకు కొదవలేదు. ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్‌ నమ్‌దే స్లోగన్‌తో ప్రచారాలు ప్రారంభించే ఆర్సీబీ, లీగ్‌ చివరి దశకు చేరుకునే సరికి నిరాశ మిగులుస్తోంది. ఐపీఎల్‌ 2024లోనే జట్టు ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఏప్రిల్‌ 15న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో రికార్డు స్కోరు(287) సాధించడం, ఆర్సీబీ మొత్తంగా ఆరో ఓటమిని మూటగట్టుకోవడం ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రముఖులు మహేష్‌ భూపతి, టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌, మనోజ్‌ తివారీ తదితరులు ఆర్సీబీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.

  • ఆర్సీబీపై వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవమైన ప్రదర్శనపై సెహ్వాగ్, తివారీ స్పందించారు. భారత సహాయక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం కనిపించిందని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. RCB కోచింగ్ స్టాఫ్‌లో ఎక్కువగా విదేశీ కోచ్‌లు ఉంటారని, లోకల్‌ ప్లేయర్స్‌ డెవలప్‌మెంట్‌కు ఆటకంగా మారిందని చెప్పాడు.

"టీమ్‌లో 12-15 మంది భారతీయ ఆటగాళ్లు ఉంటే, కేవలం 10 మంది ఓవర్‌సీస్‌ ప్లేయర్‌లు ఉంటారు. సపోర్టింగ్‌ స్టాఫ్‌ మొత్తం విదేశీలు ఉంటే సమస్య తలెత్తుతుంది. భారత ఆటగాళ్లలో సగం మందికి ఇంగ్లీష్ కూడా రాదు. వారిని ఎలా మోటివేట్‌ చేస్తారు? వారితో ఎవరు సమయం గడుపుతారు? వారితో ఎవరు మాట్లాడతారు? ఆర్సీబీలో నేను ఒక్క భారతీయ సిబ్బందిని కూడా చూడలేదు. కనీసం ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్‌ పెంచే వ్యక్తి ఎవరైనా ఉండాలి' అని పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంపైనా సెహ్వాగ్ మాట్లాడాడు. భారత కెప్టెన్‌ ఉంటే ఆటగాళ్లు మనసులో మాటను చెప్పగలరని తెలిపాడు. RCBకి కనీసం 2-3 మంది భారతీయ సహాయక సిబ్బంది అవసరమని సూచించాడు.

  • ఆర్సీబీ సమస్య నాకు తెలుసు?
    మనోజ్‌ తివారీ మాట్లాడుతూ - "సమస్య ఏంటో నాకు తెలుసు. వేలంలో అందరు ప్లేయర్‌లను ఇతర టీమ్‌లకు వెళ్లి ఆడమని వదిలేస్తారు. అలా వదిలేసిన చాహల్‌, ఈ సీజన్‌లో పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌. ఆర్సీబీ వదులుకున్న శివమ్‌ దూబే అద్భుతంగా రాణిస్తున్నాడు. అదనంగా గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ వంటి ఖరీదైన ఆటగాళ్లను తీసుకోవడం ఆశ్చర్యకరం. ఆర్సీబీ బ్యాటింగ్ సమస్య కాదు. వారికి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. కొన్ని ఆన్-ఫీల్డ్ కెప్టెన్సీ కాల్స్ భయంకరంగా ఉంటున్నాయి. ఆర్సీబీకి లాంగ్‌ టర్మ్‌ గోల్‌, సమూల ప్రక్షాళన అవసరం" అని వివరించాడు.

మరోవైపు టెన్నిస్‌ స్టార్‌ మహేష్‌ భూపతి ఆర్సీబీ ఫ్రాంచైజీని మరొకరికి విక్రయించాలని, వారైనా టీమ్‌ని సక్రమంగా తీర్చిదిద్దుతారని బీసీసీఐకి సూచించాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ సీజన్​లో ఆర్సీబీ 7 మ్యాచ్‌లు ఆడింది. ఒకే ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించాలంటే, RCB మిగిలిన అన్ని గేమ్‌లను గెలవడమే కాకుండా, ఇతర టీమ్‌ల ఫలితాలు కూడా కలిసి రాక తప్పదు. మొత్తంగా ఆర్సీబీ వరుస పరాజయాలు ఫ్యాన్స్‌ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్​ ఆశలు- బెంగళురుకు ఛాన్స్ ఉందా? - RCB Playoff Chances IPL 2024

జెట్ స్పీడ్​లో 'సన్​రైజర్స్'- ఇది 2.O వెర్షన్- కానీ అదొక్కటే లోటు! - Sunrisers Hyderabad IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.