Vastu Tips For For Kitchen : సనాతన ధర్మంలో మనుషుల జీవితాలను సుఖవంతం చెయ్యడానికి ఉద్దేశించినదే వాస్తు శాస్త్రం. మనం ఉండే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటే అందులో నివసించే వాళ్లకు ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది వాస్తు గురించి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు ప్రకారం వంట గది ఎలా ఉండాలో, పూజ మందిరం విషయంలో చెయ్యకూడని కొన్ని తప్పులు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వంటగది విషయంలో ఇవి పాటించండి
ఇంట్లో ఎంతో కీలకమైన వంటగది విషయంలో ఖచ్చితమైన వాస్తు నియమాలను పాటించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం వంటగది కిటికీలు తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండాలి. ఇలా ఉండటం వల్ల గాలి చక్కగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వంటగది గోడలకు పసుపు, నారింజ, గులాబి, చాక్లెట్, ఎరుపు రంగులు వేసుకుంటే మంచిదని వాస్తు చెబుతోంది. వంటగది కింద లేదంటే పక్కన టాయిలెట్ నిర్మించకూడదని వాస్తు చెబుతోంది. వంటగదికి, టాయిలెట్‌కు ఒక్కటే గోడ ఉండకూడదు. అలాగే వంటగది ద్వారం ఇంటి ముఖద్వారం ఎదురుగా ఉండకూడదు. వీధి గుమ్మం నుంచి చూస్తే వంటగది కనిపించని విధంగా నిర్మించుకోవాలని వాస్తు చెబుతోంది. ఇలా ఉండకపోతే కుటుంబ సభ్యులు ఇబ్బందులు, జీర్ణ సంబంధ రుగ్మతలు వస్తాయని వాస్తు వివరిస్తోంది. వంటిల్లు తూర్పు, ఉత్తర తూర్పు దిశలో ఉండకూడదని, ఇలా ఉంటే అభ్యున్నతి తగ్గిపోతుందని వాస్తు చెబుతోంది.
ఉప్పును వాస్తు ప్రకారం ఇలా వాడండి
వంటల్లో ఉప్పు అనేది ఎంత ముఖ్యమో వాస్తులో కూడా దీనికి అంతే ప్రాధాన్యత ఉంది. ఉప్పు అనేది చాలా దోషాలకు నివారిణిగా పని చేస్తుందని వాస్తు చెబుతోంది. అనుకున్న పనులు కావాలంటే, అభ్యున్నతి సాధించాలంటే స్నానం చేసే నీళ్లలో గుప్పెడు ఉప్పు వేసుకుంటే మేలు కలుగుతుందని వాస్తు చెబుతోంది. అలాగే ఇంటికి శుభం కలగడానికి ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేసుకొని తుడుచుకుంటే మంచిదని వాస్తు వివరిస్తోంది.
ఈ తప్పులు అస్సలు చెయ్యకండి
చాలామంది దేవుడి చిత్రపటాలు లేదంటే పూజా మందిరం కోసం స్థలం లేదని సిలిండర్ మీద లేదంటే సింక్ మీద పెడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు అని వాస్తు చెబుతోంది. దీని వల్ల ఇంట్లో వాళ్లకు నష్టం కలుగుతుందని వాస్తు వివరిస్తుంది.
ఇలా చేసి చూడండి
ఇంట్లో వాళ్లు చేసే వ్యాపారం, ఉద్యోగం వంటి వృత్తుల్లో అభ్యున్నతి సాధించాలనుకుంటే నిత్యం పూజ గదిలోని ఇష్టమైన దేవుడి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించాలని వాస్తు చెబుతోంది. అలాగే అశోక ఆకులు, గన్నేరు, మామిడాకుల తోరణం ఇంటి ముఖద్వారానికి కడితే సకల శుభాలు కలుగుతాయని చెబుతోంది. ఒకవేళ అంత: శత్రువుల బాధ ఉన్నట్లయితే వెండి చేప బొమ్మను చేయించి, వద్ద ఉంచుకోవాలని వాస్తు చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాస్తు దోషం - ఇంటి మెయిన్ డోర్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!