ETV Bharat / spiritual

వాస్తు ప్రకారం మీ ఇంట్లో డస్ట్​బిన్​ సరైన దిశలో ఉందా? - లేదంటే ఆర్థిక కష్టాలు వస్తాయట!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 2:07 PM IST

Vastu Tips for Dustbin : మీ ఇంట్లో డస్ట్​బిన్ సరైన దిక్కులో ఉందా? అదేంటి చెత్త, చెదారం వేసే డబ్బకు కూడా మంచి దిశ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. వాస్తు ప్రకారం చెత్త డబ్బాను కూడా సరైన దిశలో ఉంచాలట. లేకపోతే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips
Vastu Tips for Dustbin

Vastu Tips for Dustbin Direction : ఈరోజుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా.. కొత్త ఇల్లు కొనాలన్నా దాదాపుగా అందరూ వాస్తు నియమాలను ఫాలో అవుతుంటారు. అయితే.. ఇంటి విషయంలోనే మాత్రమే కాకుండా.. ఇంట్లో ఉంచే వస్తువుల అమరిక విషయంలో కూడా వాస్తుశాస్త్రాన్ని తప్పక పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. దీని ప్రకారం.. ఇంట్లో డస్ట్​బిన్​ కూడా సరైన దిశలో ఉంచాలని సూచిస్తున్నారు. అలాకాకుండా.. ఎక్కడ పడితే అక్కడ డస్ట్​బిన్ ఉంచితే కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందట. మరి.. వాస్తు ప్రకారం డస్ట్​బిన్​ను ఏ దిశలో పెట్టకూడదు? ఏ దిక్కులో ఉంచితే ఉత్తమ ఫలితాలు వస్తాయి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాస్తు దోషం - ఇంటి మెయిన్‌ డోర్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

డస్ట్​బిన్ పెట్టకూడని దిశలు : వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్​బిన్​ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుందట. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వాస్తునిపుణులు. అంతేకాకుండా ఇంట్లోని వారిపై నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడుతుందట. దాంతో మానసిక సమస్యలు రావొచ్చంటున్నారు.

ఈశాన్యం మాత్రమే కాదు.. తూర్పు, ఆగ్నేయ, ఉత్తర దిశలలో కూడా వాస్తుప్రకారం చెత్తబుట్ట పెట్టకూడదు. ఆ దిశలలో ఉంచితే ఇంట్లో దారిద్య్రం చేరే ప్రమాదం ఉందట. అలాగే ఇంట్లోని వారికి దుఃఖం, పురోగతికి ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చెత్తబుట్ట ఉంచాల్సిన దిక్కు : వాస్తు ప్రకారం డస్ట్​బిన్ పెట్టేందుకు ఉత్తమ దిశలు నైరుతి లేదా వాయువ్యం. ఈ దిశలను ఎంచుకుని అక్కడ చెత్తబుట్ట పెట్టడం వల్ల మీరు చేసే పని మీద దృష్టి పెడతారట. అలాగే ప్రతికూల ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటాయట. ఇంట్లో పాజిటివిటీ పెరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయంటున్నారు వాస్తు నిపుణులు.

డస్ట్​బిన్​కు సంబంధించి మరి కొన్ని వాస్తు టిప్స్ :

  • వాస్తుప్రకారం.. డస్ట్‌బిన్‌ను ఇంటి వెలుపల ఉంచడం మంచిది.
  • ఎందుకంటే ఇది అనవసరమైన ఖర్చులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇంటి సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • అలాగే చాలా మంది ఇంటి ప్రవేశద్వారం వద్ద చెత్త డబ్బను ఉంచుతారు. కానీ, వాస్తు ప్రకారం అలా పెట్టడం మంచిది కాదు.
  • ఎందుకంటే ఇలా ఉంచడం కారణంగా నెగిటివ్ ఎనర్జీ చేరే అవకాశం ఉంటుంది.
  • అదేవిధంగా, పూజా స్థలం దగ్గర డస్ట్​బిన్‌ను ఉంచడం మానుకోవాలి.
  • ఇది పవిత్ర వాతావరణానికి భంగం కలిగించవచ్చు. అలాగే పడకగదిలో కూడా చెత్త డబ్బాలను ఉంచవద్దని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.

మీ బాత్‌రూమ్‌ ఇలా ఉంటే - వాస్తు దోషం చుట్టుముడుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.