ETV Bharat / politics

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 4:23 PM IST

Updated : Mar 28, 2024, 8:00 PM IST

Not to vote for CM Jagan : హత్య చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారు అని వైఎస్ వివేకా కూతురు సునీత ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డిని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు వేయమని కోరడం తప్పుగా అనిపించట్లేదా అని సునీత నిలదీశారు. అన్నీ మరిచిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుందని ఆమె మండిపడ్డారు.

ys_sunitha_fire_on_cm_jagan
ys_sunitha_fire_on_cm_jagan

Not to vote for CM Jagan : ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి పొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలు వైఎస్ వివేకా హత్యోదంతాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు నర్రెడ్డి సునీత సీఎం జగన్​పై విరుచుకుపడ్డారు. హత్య కేసు దర్యాప్తు, నిందితులు, ఆధారాలు, విచారణ కుట్రలను బయటపెట్టారు.

హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత

రాష్ట్ర సీఎం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధరించలేదని సునీత ప్రశ్నించారు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా?, మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? అని నిలదీశారు. నా పైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? అని సునీత వాపోయారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందన్న సునీత ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు?ని జగన్​ను ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని, మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారే నేను చెప్పేదంతా నిజం నాలాగే ఆయన చెప్పగలుగుతారా? అని కడిగిపారేశారు. వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారన్న సునీత హత్య చేసిన వ్యక్తి... తనను ఎవరు ప్రేరేపించారో, ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు.

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

నిందితుల వెనక అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నా, మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారని, మళ్లీ మీరే వద్దన్నారని గుర్తు చేస్తూ మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? అని నిలదీశారు. నిందితుడని సీబీఐ చెబుతున్నా, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని ఎలా కోరుతున్నారు, మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా అని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదు, ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారు? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. 'నేను పోరాడేది న్యాయం కోసమైతే మీరు పోరాడేది పదవుల కోసం అని సునీత స్పష్టం చేశారు.

పదవులు ఆశించి రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న మీకు ఐదేళ్లపాటు చెల్లెళ్లు గుర్తు రాలేదా? అని నిలదీశారు. మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు, అన్నీ మరిచిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 'హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్సార్సీపీ పార్టీ పునాదులు వైఎస్ వివేకా రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీకి, మా అన్న గారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్​ ఓటు వేయకండి' అని సునీత విజ్ఞప్తి చేశారు.

జగన్​ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్​ సునీత

Last Updated :Mar 28, 2024, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.