ETV Bharat / politics

తోట త్రిమూర్తులును వైఎస్సార్సీపీ తొలగిస్తుందా ? - ఆనవాయితీ ప్రకారం వెనకేసుకొస్తుందా ? - MLA Ticket to MLC Thota Trimurthulu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 9:46 AM IST

Will YSRCP Give MLA Ticket to MLC Thota Trimurthulu: దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తప్పిస్తుందా ? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. త్రిమూర్తులు పైకి సాత్వికుడిలా కనిపిస్తారు గానీ, చేసేవన్నీ దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమాలే.

Will YSRCP Give MLA Ticket to MLC Thota Trimurthulu
Will YSRCP Give MLA Ticket to MLC Thota Trimurthulu

Will YSRCP Give MLA Ticket to MLC Thota Trimurthulu : దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తప్పిస్తుందా ? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. త్రిమూర్తులు పైకి సాత్వికుడిలా కనిపిస్తారు గానీ, చేసేవన్నీ దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమాలే. నిత్యం 25-50 మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతారు. అరాచకాలకు పాల్పడటాన్నే ప్రామాణికంగా అమలు చేస్తున్న వైసీపీ అధిష్ఠానం త్రిమూర్తులుకు శిక్ష పడటాన్ని అదనపు అర్హతగా భావిస్తుందేమో!

వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలుశిక్ష - Venkatayapalem Shiromundanam Case

త్రిమూర్తులుపై కేసుల వివరాలు :

  • 1997లో ద్రాక్షారామ పోలీసుస్టేషన్‌లో శిరోముండనం కేసు
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూలు పోలీసుస్టేషన్‌లో 2005లో ఒక కేసు
  • కాకినాడ జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్‌లో 2006లో ఒక కేసు
  • త్రిమూర్తులు సోదరుడు కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. ఆ హత్యలో భాగస్వాములైన 11 మంది తర్వాత హతమయ్యారు. త్రిమూర్తులు వర్గానికి చెందిన తండ్రీకొడుకులను ప్రత్యర్థివర్గం హత్యచేసింది. హైదరాబాద్‌లో దాక్కున్న వారిని కొందరు పోలీసుల వేషంలో వెళ్లి తీసుకొచ్చారు. తర్వాత వారు చనిపోయారు. ఇందులో కీలకపాత్ర త్రిమూర్తులుదేనని కొందరు అంటున్నా కేసుల్లో ఎక్కడా ఆయన పేరు లేదు. ఇలా చేతికి మట్టి అంటకుండా చేస్తారని అంటారు.
  • గతంలో జడ్పీ సమావేశంలో 'చెంప దెబ్బ తింటావ్‌' అంటూ ప్రస్తుత ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను త్రిమూర్తులు దూషించారు.
  • త్రిమూర్తులు వ్యవహారశైలి దూకుడుగా ఉంటుంది. ఎవరినైనా తిడతారు. బెదిరిస్తారు. అధికారులనైనా సరే, 'చెప్పిన పని చెయ్‌' అని బెదిరిస్తారు. ఆర్టీసీ భూమిని లీజుకు తీసుకుని, అక్కడ థియేటర్‌ కట్టారు. దీనిపై ఒక సామాజిక కార్యకర్త నిరసన చేపడితే కేసులతో భయపెట్టారు. చివరకు థియేటర్‌ ప్రారంభ సమయంలో త్రిమూర్తులుకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్‌ కట్టేలా చేశారు.పెద్దగా చదువుకోని త్రిమూర్తులు మొదట్లో అమలాపురం ప్రాంతంలో దూడల మారు బేరగాళ్లుగా ప్రస్థానం ప్రారంభించారు.
  • తర్వాత రామచంద్రపురం చేరుకుని1994లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అప్పట్నుంచి గేర్‌ మార్చారు. సెటిల్‌మెంట్లు, భూ దందాలు, పంచాయితీకి వచ్చినవారిని బెదిరించి తానే రాయించుకోవడం వంటి అక్రమాలకు తెరతీశారు. కాజులూరు మండలం పల్లెపాలెంలో 32 ఎకరాలు ఇలాగే రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై 2022 నవంబరులో జనసేన నేత లీలాకృష్ణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ఎలాంటి చర్యలూ లేవు.

తోట త్రిమూర్తులును పదవి నుంచి తప్పించాలని.. కలెక్టరేట్​ ముట్టడి

అన్ని పార్టీలూ తిరిగొచ్చి : 1994లో రామచంద్రపురంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన త్రిమూర్తులు తర్వాత టీడీపీ, ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్‌లకు మారారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రామచంద్రపురంలో ఓడిపోయాక వైఎస్సార్సీపీలో చేరి, అదే పార్టీ ఎమ్మెల్సీగా 2021 నుంచి కొనసాగుతున్నారు.

తోట త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోండి: శ్రవణ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.