ETV Bharat / politics

ప్రచార పర్వంలో దూసుకుపోతున్న టీడీపీ జనసేన అభ్యర్థులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 10:21 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

TDP Janasena started campaigning
TDP Janasena started campaigning

TDP Janasena started campaigning: పొత్తులో భాగంగా తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో దాదాపు 90శాతం వరకు సీట్ల కేటాయింపు పూర్తవడంతో, అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వివిధ వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ, తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. మూడు పార్టీల మధ్య సమన్వయ సభలు ఏర్పాటు చేసి, కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జోరందుకున్నాయి.

ప్రచార పర్వంలో దూసుకుపోతున్న టీడీపీ జనసేన అభ్యర్థులు
టీడీపీలోకి మెుదలైన వలసలు: చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి తెలుగుదేశంలో చేరారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఒంగోలులోని 21 డివిజన్‌కు చెందిన అడ్వకేట్‌ శ్రీకాంత్ దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. ఆయనతో పాటు 120 కుటుంబాలు కూడా చేరాయి.

తెలుగుదేశం, జనసేన కార్యకర్తలతో సమావేశం: పల్నాడు జిల్లా పెదపరిమి నుంచి పెదకూరపాడు వరకు తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీమహిళలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విశాఖలో పార్లమెంట్‌ అభ్యర్థి భరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఎన్డీఏ కూటమి తొలి సభకు ముమ్మర ఏర్పాట్లు - 'ప్రజాగళం'గా పేరు ఖరారు

ఇంటింటికీ తురుగుతు ప్రచారం చేస్తున్న నేతలు: అనంతపురం జిల్లా ఉరవకొండలో చేనేత వర్గానికి చెందిన తొగటులతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కనేకల్‌లో కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. మూడు పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‍ కల్యాణ్‍ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధిగా జంగాలపల్లి శ్రీనివాసులను ప్రకటించడంతో, ఆయన నగరంలోని శ్రీకపిలేశ్వరాలయం, తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

ప్రచారంలో దూసుకుపోతున్న వంగలపూడి అనిత: అనకాపల్లి జిల్లాలో కూటమి అభ్యర్థి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రహిత పాలన అందించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించడానికి టీడీపీ, జనసేన , బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళుతున్నాయన్నారు. అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

జగన్‌ అరాచక పాలనను అంతమొందించడానికే కూటమి : నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.