ETV Bharat / politics

జగన్​ సభ అంటేనే జనం హడల్ - వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న ఆంక్షలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 1:26 PM IST

Updated : Mar 7, 2024, 3:22 PM IST

people_suffering_with_cm_jagan_meeting
people_suffering_with_cm_jagan_meeting

People Suffering with CM Jagan's Meeting : సీఎం జగన్​ సభ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ మళ్లింపు కష్టాలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించగా భారీ వాహనాలను రోడ్ల వెంట నిలిపేశారు. సభకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.

People Suffering with CM Jagan's Meeting : అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించారు. ఈ సభ కోసం అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేశారు. సభకు వెళ్లే ఆటోల కోసం భారీ వాహనాలను జాతీయ రహదారి మీద రాకుండా అడ్డుకున్నారు. లంకెలపాలెం కూడలి వద్ద భారీ వాహనాలు దారి మళ్లించారు. అప్పటికే జాతీయ రహదారి మీద ఉన్నటువంటి లారీలు, ఇతర వాహనాలను రోడ్డు పక్కనే నిలిపి ఉంచేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అనకాపల్లి జాతీయ రహదారి పక్కనే చాలా లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి లారీల డ్రైవర్లు సైతం నిరీక్షించక తప్పలేదు. ఎన్ని గంటల వరకు నిలుపుతారో తెలియక, ఎందుకు నిలిపారో తెలియక లారీ డ్రైవర్లు నానా అవస్థలు పడ్డారు.

'సీఎం జగన్ సభ.. వెళ్లకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్..' డ్వాక్రా ఆర్పీ ఆడియో లీక్

సీఎం సభకు ఆటోల తరలింపు కోసం, వాహనాలు తరలింపు సమయంలో జాతీయ రహదారి పైన వెళ్లే ఇతర వాహనదారులను పోలీస్ శాఖ ఇబ్బంది పెట్టింది. సీఎం సభ ఏమోగానీ సీఎం పర్యటన అంటే చాలు ఆ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు, మరీ ముఖ్యంగా లారీ డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసిని కాడ వద్ద ఈరోజు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభకు జనం పెద్దగా రాకపోవడంతో వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు ఎలమంచిలి లో నిలిచిపోయాయి. ఎలమంచిలి మున్సిపాలిటీ నుంచి భారీగా జనం తరలించడానికి 64 బస్సులు ఏర్పాటు చేశారు. అయితే అనుకున్నంత మంది జనం సభకు వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఎలమంచిలి లో కొన్ని బస్సు ఖాళీగా ఉండిపోయాయి. ఈ బస్సులెక్కడానికి ఒక్కరు కూడా లేకపోవడంతో పట్నంలో మూడు బస్సులు నిలిపివేశారు.. ఇక్కడి నుంచి వెళ్లిన బస్సుల్లో కూడా సగం సీట్లు కూడా నిండ జనం లేక ఖాళీగా వెళ్లాయి.

సీఎం సభకు రావాల్సిందే - డ్వాక్రా మహిళలపై అధికారుల ఒత్తిడి

అనకాపల్లి జిల్లా కసింకోట సమీపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేయూత సభ గురువారం నిర్వహిస్తుండగా, పోలీసుల ఆంక్షలతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా, ఉద్దండపురం సమీపంలో పోలీసులు నిలిపివేశారు. పోలీసులు ఇక్కడకు చేరుకుని వాహనాలను ఓ వైపు నిలిపేశారు. ఉదయం నుంచే వీటిని నిలిపేయడంతో చోదకులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

సీఎం జగన్​ సభకు స్కూల్​ బస్సులు - సెలవు ప్రకటించిన విద్యా సంస్థలు

సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిలో భాగంగానే అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వాస్తవానికి ఈనెల 7న సీఎం అనకాపల్లి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గం లోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పీవీఎస్ఎన్ రాజును గృహ నిర్బంధంలో ఉంచారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఈ మెయిల్ పంపించారు. నాటి ఎన్నికల వాగ్దానం ఏమైందని ప్రశ్నంచారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని గగ్గోలుపెట్టి, అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపించి అన్యాక్రాంతమైన భూములన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని గొప్పగా చెప్పారు. మీరు అధికారం లోకి వచ్చిన తరువాత సిట్ నివేదిక ఏమైందో ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‍ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాడానికి వైసీపీ వైఖరి, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విభజన హామీలు, వెనుక బడిన ఉత్తరాంధ్ర కి ప్రత్యేక ప్యాకేజీ పైన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వారం స్పందనలో విశాఖలో భూకబ్జాలపై 190 పిర్యాదులు అందాయంటే ఎంత పెద్దఎత్తున పథకం ప్రకారం దోచుకుంటున్నారో అర్థం అవుతోందని తెలిపారు. రాజధాని ప్రకటన చేసిన తరువాత మరీ బరితెగించి కబ్జాదారులు ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారుని పైడిరాజు అన్నారు.

సీఎం జగన్​ సభకు ప్రజల నుంచి రాని స్పందన - ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు

Last Updated :Mar 7, 2024, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.