సీఎం జగన్ సభకు ప్రజల నుంచి రాని స్పందన - ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు
No Response from People to CM Meeting: పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించక ముందే జనం తిరుగుముఖం పట్టారు. పెద్ద ఎత్తున మహిళలను బస్సుల్లో తరలించినా.. వారంతా కూడా సభా వేదిక నుంచి సభ ప్రారంభంలోనే వెళ్లిపోయారు. భోజనాలన్నీ బస్సు పాయింట్ వద్ద ఏర్పాటు చేయడంతో సభకు వచ్చిన జనమంతా.. సీఎం ప్రసంగం వినకుండానే సభ నుంచి వెనుతిరిగారు.
Passengers facing Problems Due to Lack of Buses Over Jagan Meeting: మాచర్లలో సీఎం జగన్ సభ కారణంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండులో బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు. సీఎం సభకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండు నుంచి ప్రత్యేకంగా 25 బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించారు. దీనితో గుంటూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండలతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.