ETV Bharat / politics

చంద్రబాబు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం- కానిస్టేబుల్​ను పట్టుకున్న టీడీపీ నేతలు - Phone tapping in TDP workshop

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 9:06 PM IST

Phone Tapping in Workshop Organized by Chandrababu: టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కానిస్టేబుల్​ను టీడీపీ శ్రేణులు గుర్తించడంతో సమావేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను ఐజీ పంపితేనే వచ్చినట్లు సదరు కానిస్టేబుల్ చెప్పిన మాటలపై టీడీపీ నేత బొండా ఉమ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.

phone_tapping
phone_tapping

Phone Tapping in Workshop Organized by Chandrababu: విజయవాడలో అధినేత చంద్రబాబు నిర్వహించిన టీడీపీ వర్క్​షాప్​లో ఫోన్ ట్యాపింగ్(Phone tapping in TDP workshop) కలకలం రేపింది. తెలుగుదేశం వర్క్ షాప్​లో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని నేతలు పట్టుకున్నారు. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. కేశినేని చిన్ని ఫోన్ను ట్యాప్ చేస్తున్నట్టు నేతలు ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ(Bonda Umamaheswara Rao) ఆరోపించారు.

ఎంపీ కృష్ణదేవరాయలు పేరిట వైఎస్సార్సీపీ ట్వీట్- ఈసీకి ఫిర్యాదు - TDP Leaders on Visakha drug case

చంద్రబాబు అధ్యక్షతన పార్టీ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని తెలిపారు. అయితే అతన్ని నిలదీయగా అక్కడకు ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారని తెలిపారు. కేశినేని చిన్ని(Kesineni Chinni) కదలికల మీద నిఘా పెట్టినట్టు తమకు తెలిసిందిని వెల్లడించారు. కేశినేని చిన్ని కదలికలపై నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్​లో తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని మండిపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లపై కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం - AP Volunteers campaigning For YSRCP

గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేసారాని గుర్తు చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్​వేర్(Pegasus Software) కొనుగోలు చేసినప్పుడే వైఎస్​ జగన్ అదే తరహా సాఫ్ట్​వేర్ కొనుగోలు చేసారని ఆరోపించారు. తామిచ్చిన కంప్లైంట్​పై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేయడానికి ఇంటెలిజెన్స్ ప్రయత్నించిందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్​ను పట్టుకుంటే అసలు విషయాలు బయటకు వచ్చాయని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని చిన్ని ఆరోపించారు.

#JaganForDrugs ట్విట్టర్​లో ట్రెండింగ్​ - విశాఖ డ్రగ్స్ కేసు విచారణకు టీడీపీ నేతల పట్టు - visakha Drugs case

సీఎం జగనుకు కార్యకర్తల్లా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు బరి తెగించారని దుయ్యబట్టారు. ప్రధాని సభకు వచ్చినందుకు ఏకంగా హత్యలే చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు వైసీపీకి ఓ లెక్కే కాదని ఆక్షేపించారు. తెలుగుదేశం నేతలపై నిఘా పెట్టే బదులు, డ్రగ్స్ ఎవరు తెచ్చారనే అంశం పోలీసులు, అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి(Kommareddy Pattabhi Ram) హితవుపలికారు. జగన్ సింగిల్ కాదు, ఆయన వెంట మాఫియా ఉందని ఆరోపించారు. జగన్ మాఫియాకు, ప్రజలకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు.

చంద్రబాబు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం - ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న టీడీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.