ETV Bharat / politics

బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు సీఎం కావాలి: ఎమ్మెల్యే పార్థసారధి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 4:56 PM IST

MLA Kolusu Parthasaradhi Join in TDP : రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని ఆయనతో పాటు టీడీపీలో చేరిన ప్రముఖ నాయకులు అన్నారు.

mla_kolusu_parthasaradhi_joined_tdp
mla_kolusu_parthasaradhi_joined_tdp

MLA Kolusu Parthasaradhi Join in TDP : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు షాకు మీద షాకులిస్తున్నారు. ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే, ప్రముఖ బీసీ నాయకుడు కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ముగ్గురు నేతలకు లోకేశ్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి పని చేసేందుకు వచ్చిన పార్థసారధి, భవకుమార్, చంద్రశేఖర్ తో పాటు చేరిన నాయకులకు లోకేశ్ (Lokesh) అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయని చెప్పారు.

పార్టీలో చేరిన వారిలో పెనమలూరు నియోజకవర్గం నుంచి వల్లభనేని సత్యనారాయణ (ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్), నెరుసు రాజ్యలక్ష్మీ (కంకిపాడు ఎంపీపీ) ధూళిపూడి కృష్ణకిషోర్ (కంకిపాడు వైస్ ఎంపీపీ), రొండి కృష్ణా యాదవ్ (జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్), మాడలి రామచంద్రారావు (మండల పార్టీ అధ్యక్షుడు), లోయ ప్రసాద్ (బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), లింగమనేని సత్యవేణి (సీతారామపురం సర్పంచ్), పోలవరపు బొబ్బి (తాడిగడప మాజీ ఎంపీటీసీ), పార్టీ నేతలు కొలుసు పోతురాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, కొడాలి రవి, మండవ ప్రగతి, నలి మాధవ్, దుద్దుకూరి వెంకటకృష్ణారావు, బోడపాడు శంకర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తుపాకుల మహేష్ (వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి), పుప్పాల వెంకటసుబ్బారావు (సీనియర్ నాయకులు), మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్ యార్డు డైరక్టర్), చెన్ను సురేష్ (విజయవాడ నగర వైసిపి యూత్ జనరల్ సెక్రటరీ), ఇజ్జడ ప్రదీప్ (సిటీ వైసిపి పబ్లిసిటీ విభాగం కార్యదర్శి),ఉప్పులేటి అనిత (నగర వైసిపి లీగల్ సెల్ విభాగం కార్యదర్శి), పొలిమెట్ల డానియేల్ (అఖిలభారత క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్), నర్రా అరుణ్ బాబు (వైసిపి సిటీ యువజన విభాగం కార్యదర్శి), సోనా సునీత, సోనా జయకుమార్, సోనా రాజేశ్వరి, కురుముల రాజా, షేక్ నాగూర్ తదితర ముఖ్యనేతలు యువనేత సమక్షంలో పార్టీలో చేరారు.

బెజవాడలో వైఎస్సార్సీపీ ఖాళీ ! - టీడీపీలోకి పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన

ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ ఖాళీ అవుతోందని టీడీపీ సీనియర్‌ నేత కేశినేని చిన్ని తెలిపారు. మంచి వారు ఎవరున్నా పార్టీలో చేర్చుకుంటామన్నారు. మైలవరం టిక్కెట్ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని చిన్ని స్పష్టం చేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని తెలుగుదేశం నేత ఎంఎస్ బేగ్ (MS Baig) తెలిపారు. పార్టీ తన గురించి అభిప్రాయ సేకరణ చేపడుతోందన్నారు. విజయవాడ పశ్చిమ లేదా వేరే చోట నుంచి పోటీ చేయమన్నా చేస్తానని అన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఎంఎస్‌బేగ్‌ వెల్లడించారు.

"వైఎస్సార్సీపీ పతనానికి బటన్ పడింది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం"

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని నూజివీడు తెలుగుదేశం అభ్యర్థి కొలుసు పార్థసారధి విమర్శించారు. అరాచక పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం-జనసేనతోనే సాధ్యమన్న ఆయన, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తెలిపారు. నూజివీడులో తెలుగుదేశం జెండా (Telugu Desam Flag) ఎగురవేస్తామని స్పష్టం చేశారు. కొలుసు పార్ధసారధి, కేశినేని చిన్ని ఇతర నాయకులు పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేశారు. పార్థసారధిని ఇప్పటికే నూజివీడు అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

బెజవాడలో వైఎస్సార్సీపీ ఖాళీ ! - టీడీపీలోకి పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.