ETV Bharat / state

Telugu Desam leaders: "వైఎస్సార్సీపీ పతనానికి బటన్ పడింది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం"

author img

By

Published : Jun 27, 2023, 2:24 PM IST

నెల్లూరులో టీడీపీ నేతల సమావేశం
నెల్లూరులో టీడీపీ నేతల సమావేశం

Telugu Desam leaders comments: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనానికి నెల్లూరు జిల్లా నుంచి అడుగులు పడ్డాయని టీడీపీ నేతలు అన్నారు. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీలోకి రావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఖాయమని అన్నారు.

నెల్లూరులో టీడీపీ నేతల సమావేశం

Telugu Desam leaders comments: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని మాజీ మంత్రులు, తెలుగుదేశం నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, అమర్నాథ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. ఈ పాదయాత్ర లోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ ముఖ్య నేతలు బీద రవిచంద్ర నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులతోపాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, బీసీ జనార్దన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు తామంతా కృషి చేస్తామన్నారు.

యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి నారాయణ నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసిందని విమర్శించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక తిరిగి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ గౌరవ, మర్యాదలు పెంచేలా పార్టీ కోసం పని చేస్తానని ఎమ్మెల్యే కోటారెడ్డి శేఖర్ రెడ్డి చెప్పారు. పార్టీ అధినేత ఆదేశానుసారమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా నారాయణ వెల్లడించారు.

జగన్ మోహన్ రెడ్డికి రివర్స్ బటన్ పడింది. నెల్లూరు జిల్లా నుంచే పతనం ప్రారంభమైంది. సంవత్సరం అధికారం ఉందని తెలిసీ సీఎం అరాచకాలకు చెక్ పెట్టేలా వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు రావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పాత, కొత్త కలయిక ద్వారా నెల్లూరు జిల్లాలో టీడీపీని భారీ గెలిపించడానికి అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించడానికి జిల్లాలోని నాయకులందరం కృషి చేస్తాం. - అమర్నాథ్ రెడ్డి

టీడీపీ ప్రభుత్వం పనులకు పాధాన్యమిచ్చింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనులను పక్కనపెట్టింది. మళ్లీ 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. నెల్లూరులో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుందాం. - నారాయణ

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రజలందరి మద్దతుతో నభూతో న భవిష్యత్ అనే విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుంటాం. తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించడం సంతోషం. తెలుగు దేశం పార్టీ గౌరవాన్ని పెంచేవిధంగా మేం అందరం కూడా మనసా వాచా పనిచేస్తాం. - కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.