ETV Bharat / politics

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ జీవో ఎందుకు ఇచ్చారు- సజ్జలకు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న - Pawan Kalyan Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 4:58 PM IST

Pawan Kalyan Comments on Jagan in Ponnur Public Meeting: వైఎస్సార్సీపీ పాలనలో సామాన్య ప్రజల భూములకు రక్షణలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగసభలో పాల్గొన్న పవన్​ జగన్​పై పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

pawan_kalyan_election_campaign
pawan_kalyan_election_campaign (Etv Bharat)

Pawan Kalyan Comments on Jagan in Ponnur Public Meeting: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​ను అమలు చేయడంలేదని వైసీపీ నేతలు, సజ్జల చెబుతున్నారని అమలు చేయకపోతే జీవో ఎందుకు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పెమ్మసాని, ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పవన్‌ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజల భూములకు రక్షణలేదని పవన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులకు మక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోంది- మత్స్య కారులకు అండగా ఉంటాము: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Meeting

అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్లి బానిసగా ఉండలేక వెనక్కి వచ్చేశారని పవన్‌ కల్యాణ్ అన్నారు. అంబటి రాయుడు ఆత్మగౌరవం కాపాడే బాధ్యత జనసేన తీసుకుందని తెలిపారు. పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలను వైసీపీ పక్కన పెట్టిందని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి వేధించారని వ్యాఖ్యానించారు. ఆస్పత్రి ద్వారా పాడి రైతులకు సేవ చేస్తుంటే కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువులను మద్యం దుకాణాల వద్ద కాపలాగా ఉంచి అవమానించార‌ని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మందును ప్రభుత్వమే విక్రయిస్తోందని తెలిపారు. ప్రభుత్వ మద్యంలో అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పాడై ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అన్నారు.

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి తీవ్ర వ్యతిరేకత- కూటమిదే హవా - Eluru Parliament Constituency

జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పవన్‌ సూచించారు. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు కాకుండా జిరాక్స్ కాపీలు ఇస్తారా వాటికి విలువ ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంకా చట్టం అమలు కాలేదని సజ్జల అంటున్నారు అమలు కాకపోతే జీవో ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతలను నమ్మవద్దని దళితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బర్నబాసు అనే దలితునిడి చంపేసారని వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యంను చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచక ప్రభుత్వం ఉగ్రవాద ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి సాగునీరు తాగునీరు లేకుండా చేశారని పవన్ కల్యాణ్ అన్నారు.

మద్యనిషేధం చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమా?- జగన్​కు షర్మిల మూడో లేఖ - Sharmila letter to jagan

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ జీవో ఎందుకు ఇచ్చారు- సజ్జలకు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న (Etv Bharat)

పొన్నూరులో బియ్యం మాఫియా చెలరేగిపోతోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఆ రేషన్ బియ్యం కాకినాడలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, మెగా డీఎస్సీ రాలేదని అన్నారు. స్కూళ్లకు రంగులు వేయటం తప్ప నాణ్యమైన విద్య లేదని మండిపడ్డారు. మధ్య నిషేధం చేస్తానన్న వ్యక్తి 40 వేల కోట్లు మద్యం పేరిట దోచుకుపోతున్నారని అన్నారు. అంతే కాకుండా ఇసుక పేరిట 41 వేల కోట్లు, మట్టి పేరిట పొన్నూరులోనే 2 వేల కోట్లు దోచుకున్నారని పవన్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.