ETV Bharat / politics

దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమే : అర్వింద్ - Arvind Fires on Congress

author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 6:46 PM IST

MP Arvind on Caste Reservations in Telangana : దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్​ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి అర్వింద్​ అన్నారు. సుప్రీంకోర్టు ఐదు జడ్జీల ధర్మాసనానికి వ్యతిరేకంగా, ప్రత్యేక రాజ్యాంగ చట్టం తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్​ తీసివేసింది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు.

Nizamabad MP Candidate Arvind Fires on Congress
MP Arvind on Caste Reservations in Telangana (ETV Bharat)

Nizamabad MP Candidate Arvind Fires on Congress : దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్​ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిజామాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్​ అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్​ పదం ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్​ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఫిరోజ్​ గాంధీ సమయంలో దేశాన్ని మూడు ముక్కలు చేశారన్నారు. ఈ విషయంపై తాను రెండేళ్ల క్రితం మాట్లాడిన వీడియోపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వీడియోను మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Arvind on SC, ST, OBC Reservation in Telangana : కాంగ్రెస్​ హయాంలో యూనివర్సిటీల స్టేటస్​లు తీసేసి మైనార్టీ కళాశాలగా మార్చారని అన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసి వారు విశ్వవిద్యాలయాల్లో చదవకుండా చేసింది కాంగ్రెస్​ పార్టీ అని ఆరోపించారు. 2011లో సోనియాగాంధీ మరొక జామియా మిలియా సెంట్రల్​ యూనివర్సిటీ స్టేటస్​ తీసేసి దానికి మైనారిటీ స్టేటస్​​ ఇచ్చి అందులో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజ్వరేషన్​ తీసేసినట్లు తెలిపారు. దీన్ని పార్లమెంట్​లో స్పెషల్​ చట్టం ద్వారా అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో ఆ విశ్వవిద్యాలయంలో ఎవరూ చదవలేకపోయారని అన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, హైదరాబాద్​ యూనివర్సిటీల పరిస్థితి ఇలా కాదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆనాడు రాజీవ్‌గాంధీ చెప్పారు : లక్ష్మణ్ - MP LAXMAN ON RESERVATION ISSUE

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో కలిపేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను నాశనం చేసి, వారి రిజర్వేషన్లను తీసేసి, దోచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారని నిలదీశారు. ఇంకా ఎంత కాలం ఇలా చేస్తారని అడిగారు. ఈ ప్రశ్నలన్నింటీకి రాహుల్​ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ​

"మొట్టమొదటి సారిగా దేశంలోని సెంట్రల్​ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్​లు తీసేసారు. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు కోసం కాదా? రాజ్యాంగం ఉపోద్ఘాతం​ మార్చేసి, రాజకీయాల కోసం దేశాన్ని విభజించారు. రాజ్యాంగంలో ఉన్నసెక్యులర్​ పదం వారే పెట్టారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చింది ఉపోద్ఘాతం ఇవాళ హిందూ సమాజాన్ని పూర్తిగా కన్ఫ్యూజన్​లో పెట్టేశారు." - అర్వింద్​, నిజామాబాద్​ బీజేపీ అభ్యర్థి

దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమే : అర్వింద్ (ETV BHARAT)

అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్ప కాదు : ఎంపీ అర్వింద్‌ - MP ARVIND IN CHAI PE CHARCHA TODAY

లోక్‌సభ ప్రచారపర్వంలో దూకుడు పెంచిన బీజేపీ - రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో ఓట్ల వేట - Bjp Leaders Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.