ETV Bharat / politics

అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్ప కాదు : ఎంపీ అర్వింద్‌ - MP ARVIND IN CHAI PE CHARCHA TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 11:36 AM IST

Updated : May 6, 2024, 1:45 PM IST

BJP MP Arvind Lok Sabha Election Campaign 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంలో బీజేపీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అంకాపూర్‌లో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి అర్వింద్ పాల్గొన్నారు. అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించట్లేదని అర్వింద్ ఆరోపించారు.

MP ARVIND IN CHAI PE CHARCHA  2024
MP ARVIND IN CHAI PE CHARCHA 2024 (Etv Bharat)

అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్ప కాదు (etv bharat)

MP Arvind Chai Pe Charcha in Ankapur : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో ప్రజల్లోకి వెళ్తోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

BJP Campaign Lok Sabha Elections 2024 : ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రైతులతో ఆయన చర్చించారు. అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్పకాదని అర్వింద్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని ప్రజలంతా పూజలు చేయాలి - ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు - MP Arvind Comments on Congress Govt

అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న హస్తం పార్టీ ప్రభుత్వం, ఏదో ఒక రోజు చేతులెత్తేస్తుందని అర్వింద్ జోస్యం చెప్పారు. ఉత్పాదకతతో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. బీజేపీ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పసుపు రేటు మరింత పెరుగుతుందని, వచ్చే ఏడాది రూ.30,000ల వరకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ప్రధాని మోదీ దేశానికి ఆదాయం పెంచిన తరవాత స్కీమ్‌లు పెడతారని, కానీ కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేస్తూ పథకాలు ఇస్తున్నారని అర్వింద్ విమర్శించారు.

అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించట్లేదని అర్వింద్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రేషన్ బియ్యంతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రీసైక్లింగ్ దందా చేశారని ఆక్షేపించారు. రైతులు, మహిళకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అర్వింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇపుడు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియనిది కాదు. దేశాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతి, అక్రమాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్పకాదు. రైతులకు, మహిళలకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. - అర్వింద్, నిజామాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల బూటకం : ధర్మపురి అరవింద్ - BJP MP Arvind Election Campaign

షుగర్ ఫ్యాక్టరీల పునః ప్రారంభంపై కాంగ్రెస్ మాటమారుస్తోంది : ధర్మపురి అర్వింద్ - lok sabha elections 2024

Last Updated : May 6, 2024, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.