ETV Bharat / politics

కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 9:46 PM IST

Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సతిమణీ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో ఆవేదనకు గురై చనిపోయిన వెంకటేష్, శ్రీనివాసులు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. 3 లక్షల రూపాయల వంతున వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు.

Nara Bhuvaneshwari
Nara Bhuvaneshwari

కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు చిత్తూరు జిల్లాలో కుప్పంలో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు.

ఇద్దరి కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్, యామగానిపల్లిలో శ్రీనివాసులు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది వెంకటేష్ గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకటేష్ ముగ్గురు పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదివించనున్నట్లు ప్రకటించారు. అనంతరం యామగానిపల్లిలో శ్రీనివాసులు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కుప్పంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం: ప్రజల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు స్థాపించిన అన్న క్యాంటీన్లను, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మూసేసిందని నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కీలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబు పేదల ఆకాలి తీర్చడానికి అన్న క్యాంటీన్లను తెచ్చారని పేర్కొన్నారు. పేదల కోసం తీసుకు వచ్చిన అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేస్తే తెలుగుదేశం శ్రేణులు వెనక్కు తగ్గకుండా అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని కొనియాడారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో ఆమె అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబును జైల్లో ఉంచిన 53 రోజులపాటు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని భువనేశ్వరి తెలిపారు.
ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధం - నారా భువనేశ్వరి

చంద్రబాబు అరెస్ట్​తో మెుదలైన మరణాలు: గత సంవత్సరం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టు చేసిన సమయంలో మనస్థాపానికి గురై సుమారు 200 మంది చనిపోయినట్లు టీడీపీ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఈ మేరకూ వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటుగా ఆయా కుటుంబాలకు తాము అండగా ఉన్నామని చెప్పడానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు భువనేశ్వరి బాసటగా నిలిచారు.

భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పని ఏంటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.