ETV Bharat / politics

ఇందిరా క్రాంతి పథకం కింద డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు : భట్టి విక్రమార్క

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 7:10 PM IST

Updated : Feb 18, 2024, 7:22 PM IST

Minister Bhatti on Dwakra Loans : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన పోడు చట్టం ఆధారంగా, గిరిజనలకు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అటవీ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ITDA Council meet Bhadrachalam
Minister Bhatti on Dwakra Loans

డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తాము : భట్టీ విక్రమార్క

Minister Bhatti on Dwakra Loans : మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి (Minister Bhatti) విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.

గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో(ITDA Bhadrachalam) పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరుగుతుందని భట్టి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజనులకు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి మొదలగు వాటిని మెరుగుపరిచే విధంగా అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట కార్మికులకు, ఆశా కార్యకర్తలకు సరైన సమయంలో వేతనాలు పడటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

ITDA Council meet Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు రవాణా మార్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని, జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy) పేర్కొన్నారు. భద్రాచలం సీతారాముల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాచలం పట్టణంలో వరద నివారణకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. భద్రాచలం సమస్యలు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తమ దృష్టికి తెచ్చారని, వాటన్నింటినీ త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకం మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపటానికి ప్రత్యేక కృషి చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు సమయానికి నిర్వహించలేదని మండిపడ్డారు. ఇవాళ పాలకమండలి సమావేశాలు ఉన్నాయని తెలియడంతో మంత్రులందరూ హుటాహుటిన వచ్చారన్నారు. గిరిజనులకు సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు అధికారులు చొరవ చూపాలని సమావేశంలో సూచించినట్లు తెలిపారు.

"తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తాం. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గిరిజనులకు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి మొదలగు వాటిని మెరుగుపరిచే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం". - మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

'నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డును త్వరగా ఏర్పాటు చేయండి' - కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఈటల​

Last Updated : Feb 18, 2024, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.