ETV Bharat / politics

ఏపీలో మద్యపానం ప్రాణాంతకం - జే బ్రాండ్ మద్యంతో పేదిళ్లలో చావుడప్పు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:23 PM IST

Updated : Feb 23, 2024, 10:36 AM IST

liquor_brands_in_ap
liquor_brands_in_ap

Liquor brands in AP : ఏపీలో మద్యం బ్రాండ్లు సామాన్య, పేదల పాలిట ప్రాణాంతకంగా మారాయి. కొత్త బ్రాండ్లతో పాలకులు డబ్బు పోగేసుకుంటుంటే పేదిళ్లలో చావుడప్పులు మోగుతున్నాయి. మద్యం బ్రాండ్లలో విష రసాయనాలు స్లో పాయిజన్‌’తో సమానమంటూ టీడీపీ నేతలు పరీక్ష చేయించిన ల్యాబులు ధ్రువీకరించడం గమనార్హం.

Liquor Brands in AP : మద్యపానం ఆరోగ్యానికి హానికరం! ఇది ఎప్పట్నుంచో వింటున్న హెచ్చరికే! మరి మద్యపానం ప్రాణాంతకం అనే హెచ్చరిక ఎప్పుడైనా విన్నారా? AP మద్యం తాగిన వారెవరైనా చెప్పే మాటిదే.! ఏపీ మద్యాన్నైనా వదిలేయాలి ? లేదంటే ప్రాణాల మీదైనా ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే ఆంధ్రలో జనం కోరిన బ్రాండ్లు కాదు, జగన్‌ ఇచ్చిన బ్రాండ్లే దిక్కు! రంగుల రసాయనాల్ని తలపించే మద్యంతో కాలేయాలు చెడిపోయి, నాలుకలు ఎండిపోయి, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయి, కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి! J-బ్రాండ్లతో పాలకులు డబ్బు పోగేసుకుంటుంటే పేదిళ్లలో చావుడప్పులు మోగుతున్నాయి.

ఏపీలో మద్యపానం ప్రాణాంతకం - జే బ్రాండ్ మద్యంతో పేదిళ్లలో చావుడప్పు

'బుద్ధి ఉన్నోడైతే చేయాలి' - ఓటు ఎలా అడుగుతావు జగన్?

ఇదీ రాష్ట్రంలో జగన్‌ చెప్పకుండా అమలు చేసిన నాడు-నేడు పథకం! పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలైతే మార్చలేకపోయారుగానీ మద్యం బ్రాండ్లైతే ఆయన సమూలంగా మార్చేశారు! గతంలో ఉన్నవే కాదు, ఇతర రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లేవీ ఏపీలో కనిపించవు. ప్రముఖ కంపెనీల పేర్లు పొరపాటున కూడా వినిపించవు! అలాంటి అనామక బ్రాండ్లతో నేరుగా ప్రభుత్వ దుకాణాలే తెరిపించిన జగన్‌ ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నారు. ఊతకర్రతో నడుస్తున్న వీళ్లు జేబ్రాండ్స్‌ బాధితులే.! గతంలో మైకంలో ఉన్నప్పుడే వీళ్లను చేయిపట్టుకుని ఒకరు నడిపించాల్సి వచ్చేది. ఇప్పుడు తాగకపోయినా నిటారుగా నిలుచోలేని నిస్సత్తువ ఆవరించింది. విజయనగరం జిల్లా ముంజేరు, జగ్గయ్యపేటలో ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు.

'బటన్​ నొక్కి పంచడం కంటే జగన్​రెడ్డి కొట్టేస్తున్నదే ఎక్కువ'

మంచం పట్టిన వీళ్లకు మద్యం పాత అలవాటే! జగనన్న బ్రాండ్లే (Jagannana brand) కొత్త.! వింత బ్రాండ్లుతాగి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పగలంతా పనిచేసే రోజువారీ కార్మికులు, కూలీలు ఒళ్లు నొప్పులు భరించలేక మద్యం సేవిస్తుంటారు. మత్తుగా నిద్రపోయి మర్నాడు మళ్లీ పనులకు వెళ్తారు. ఇప్పుడు నిద్రలోనే ప్రాణాలొదిలే పరిస్థితి. రాష్ట్రం మద్యం తాగే అలవాటున్న ఏ ఒక్కరిని పలకరించినా ఇంత నాసిరకం సరుకు ఎప్పుడూ చూడలేదనే మాటే! విషంతో సమానమని తెలిసీ కొనుక్కుని తాగుతున్న దుస్థితి. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు కొనలేక కొందరు శానిటైజర్లు తాగుతుంటే మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.

'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

జే-బ్రాండ్ల నమూనాలపై తెలుగుదేశం నేతలు చెన్నై ల్యాబ్‌లో పరీక్ష చేయించి బయటపెట్టిన కఠోర అంశాలివి. నరసాపురం MP రఘు రామకృష్ణరాజు చేయించిన పరీక్షల్లోనూ ఏపీ బ్రాండ్లలో బెంజోక్వినోన్, స్కోపారోన్, పైరోగలాల్, వొల్కొనిన్, కాప్రోనల్యాక్టమ్‌ తదితర రసాయనాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఈ విష రసాయనాలు స్లో పాయిజన్‌’తో సమానమంటూ ప్రధానికి కూడా ఆ వివరాలు పంపారు. ఐతే నీళ్లూ మనిషికి హానికరమేనంటూ అధికారులతో ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ నిష్టూరమాడించారు సీఎం జగన్‌.

మద్యం ఆదాయమే మహదానందంగా భావిస్తున్న జగన్‌ కూడా చెన్నై ల్యాబ్‌ నివేదికను తోసిపుచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్ని అడ్డుకోవాలనే కుట్రతోనే మద్యంపై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. అది విష ప్రచారమో, విష రసాయనమో పసుపుకుంకాలు పోగొట్టుకున్న మాకు తెలుసుగానీ, మీకేం తెలుసు జగనన్నా అని అక్కచెల్లెమ్మలు ఆక్రోశిస్తున్నారు. మద్యం నిషేధించాకే ఓట్లడుగుతానని అక్కచెల్లెమ్మల్ని నమ్మంచిన జగన్‌ ఇప్పుడు ఊరుపేరులేని మద్యం తెచ్చి కాపురాల్లో నిప్పులు పోశారు. అనేక కుటుంబాల ఉసురుపోసుకుంటున్నారు.

మద్య నిషేదం, నిషేదం అంటూనే.. 3 పెగ్గులు, 6 గ్లాసులుగా బెల్టు షాపులు

Last Updated :Feb 23, 2024, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.