Pawan Kalyan key role in TDP-BJP alliance : 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' అత్తారింటికి దారేది చిత్రంలో హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాత్రను ఉద్దేశించి ఎం.ఎస్. నారాయణ పలికిన ఈ ఫేమస్ డైలాగ్.. పవన్ రాజకీయ జీవితంలోనూ నూటికి నూరుపాళ్లు వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ రోజు ఢిల్లీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు కోసం ఒకచోట కూర్చుని మనసు విప్పి మాట్లాడుతున్నారు అంటే దానికి వెనుకున్న ఒకే ఒక శక్తి పవన్ కల్యాణ్. ఆయన నిరంతర ప్రయత్నమే ఈ పొత్తు పొడవడంలో మూలం.
టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది - వైఎస్సార్సీపీ జడిసింది!
బీజేపీ, టీడీపీ పొత్తు కోసం జనసేనాని చేసిన ఈ ప్రయత్నంలో చాలా రాళ్లు వేశారు, చాలా మంది హేళన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి నవ్వుల పాలు అవ్వడం ఈ పొత్తు కోసం పవన్ కల్యాణ్ చేసిన ఒక త్యాగం అనే చెప్పుకోవాలి. ఇక్కడ బీజేపీ మనకి అండగా రావాలి అంటే అక్కడ త్యాగం చెయ్యక తప్పని పరిస్థితుల్లో బలహీనమైన స్థానాలతో సర్దుకుని పోటీ చేశారు. ఆ ఓటమి మిగిల్చిన అవమానం అంతా ఇంతా కాదు. ఆ రోజు దిగమింగారు కాబట్టే ఈ రోజు గౌరవంతో తలెత్తుకోగలిగారు.
టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!
'రక్తం పొంగిపోతాఉంది.. ఆవేదన ఉండదాండి.! ఏం చేస్తారు మమ్మల్ని.. జైళ్లో పెడతారా?'
..తీవ్ర ఆవేదన, ఉప్పొంగిన ఆవేశం.. 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ గుర్తే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో అధికార టీడీపీ సభ్యులంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరైన సందర్భం అది.
చంద్రబాబు - మోదీ ఇద్దరూ మిత్రులే. ఇద్దరూ రాజకీయ ఉద్ధండులే. కేంద్రంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల నియామకంలో చంద్రబాబు చక్రం తిప్పగా.. తదనంతర పరిణామాలు ఇరువురి మధ్య వైరం పెంచాయి. ఈ క్రమంలో ఉప్పు-నిప్పుగా మారిపోయారు. 2002 సంవత్సరంలో గోద్రా అల్లర్లు వారి మధ్య దూరం పెరగడానికి కారణం కాగా.. సుదీర్ఘ విరామానంతరం తిరిగి 2014 ఎన్నికల్లో అనివార్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మరోసారి ఇరువురి మధ్య స్నేహం చిగురించడం వెనుక పవన్ ఉన్నారనేది వాస్తవం.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా ఎగురవేస్తా: పవన్ కల్యాణ్
ఉప్పు, నిప్పుగా కత్తులు దూసుకుంటున్న టీడీపీ, బీజేపీ ని కలుపుతా అని ఎప్పుడో చెప్పాడు. ఈ రోజు చేసి చూపించాడు. శత్రువుని ఎప్పటికీ క్షమించడనే పేరున్న, అత్యంత శక్తి వంతమైన అమిత్ షా పై తిరుపతిలో టీడీపీ వాళ్లు రాళ్లు వేశారు. టీడీపీకి మా తలుపులు శాశ్వతంగా మూసేసాం అంటూ అమిత్ షా అత్యంత కోపంగా స్పందించారు. అప్పట్లో మోడీ, చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నారు. ఇవ్వాళ అవన్నీ గతం అంటూ మర్చిపోయి చేతులు కలిపారు అంటే దాని వెనుకున్న పవనిజం ఒక్కటే నిజం.
టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది..?