ETV Bharat / politics

నేడు దిల్లీ వెళ్లనున్న పవన్‌ కల్యాణ్ - అమిత్‌షాను కలిసే అవకాశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 8:44 AM IST

Updated : Feb 8, 2024, 10:47 AM IST

Janasena Chief Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చెక్కులు అందజేశారు. రాబోయే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.

Janasena_Chief_Pawan_Kalyan_Delhi_Tour
Janasena_Chief_Pawan_Kalyan_Delhi_Tour

Janasena Chief Pawan Kalyan Delhi Tour : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అమిత్‌షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం అమరావతి నుంచి హైదరాబాద్‌ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఇవాళ అక్కడి నుంచి దిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Janasena Pawan Kalyan Meeting in Mangalagiri : రాబోయే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప వాటిని రద్దు చేసే ఆలోచనే లేదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చెక్కులు అందజేశారు. 20 మంది కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు.

పేదలకు జగన్ ఏనాడు తన సొంత జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పవన్ విమర్శించారు. డ్వాక్రా మహిళల సమస్యలు పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల రూపాయలు కష్టంలో ఉన్నప్పుడు తాము ఉన్నాము అనే చిరు ప్రయత్నం మాత్రమే అని పేర్కొన్నారు. ఈ సహాయం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.

చెక్కులు ఇచ్చేటపుడు నా గుండె బాధపడుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. చాలా సార్లు అనేక మంది గాయపడ్డారని, ఇది ఆశయం కోసం చేస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సహాయం ఇక్కడితో ఆగదన్న పవన్, కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు.

గాయపడ్డవారికి 50 వేల రూపాయలు ఇస్తున్నామన్న పవన్, దేశంలో కొండంత సహాయం చేస్తున్నామని తెలిపారు. అధికారానికి, మానవత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. మానవత్వానికి అధికారం తోడైతే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. దుర్ఘటన జరిగిన వెంటనే నాయకులు స్పందిస్తే తొందరగా సహాయం అందిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

తన సంపాదనను ప్రజలకు పంచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్న పవన్, జనసేన - టీడీపీ ప్రభుత్వం వస్తే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని స్పష్టం చేశారు. జేబులో నుంచి రూపాయి కూడా ఇవ్వలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు ఉన్న పథకాలు ఎట్టి పరిస్థితిల్లో ఆగవు అని, ఇంకా అదనంగా డబ్బులు జోడించి ఇస్తామని అన్నారు.

Last Updated : Feb 8, 2024, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.