ETV Bharat / politics

జగనన్న వదిలిన బాణం వైసీపీనే పొడుస్తోంది - కూటమి విజయం ఖాయం: పృథ్వీ - Prithviraj Met Nara Lokesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 5:04 PM IST

Updated : Apr 5, 2024, 6:00 PM IST

Jana Sena Leader Prithviraj Met Nara Lokesh in Undavalli: రానున్న ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడం ఖాయమని నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌ అన్నారు. వైసీపీ నేతల అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఉండవల్లిలో నారా లోకేశ్​ను పృథ్వీరాజ్​ మర్యాదపూర్వకంగా కలిసారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు పృథ్వీ తెలిపారు.

prithviraj_met_lokesh
prithviraj_met_lokesh

Jana Sena Leader Prithviraj Met Nara Lokesh in Undavalli: రానున్న ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడం ఖాయమని సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌ (Film actor and Jana Sena leader Prithviraj) అన్నారు. ఉండవల్లిలో నారా లోకేశ్​ను పృథ్వీరాజ్​ మర్యాదపూర్వకంగా కలిసారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు పృథ్వీ తెలిపారు.

ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి వైసీపీనే పొడుస్తోందని ఎద్దేవా చేశారు. జగన్‌ వదిలిన బాణం పోటు దెబ్బ 12 శాతం ఓట్లపై ప్రభావం పడుతుందని అన్నారు. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చానని ఈ సారి వైసీపీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని అన్నారు. జగన్‌కు ప్రజలతో పాటు ప్రకృతి కూడా జవాబిస్తుందని విమర్శించారు.

జగనన్న వదిలిన బాణం వైసీపీనే పొడుస్తోంది - కూటమి విజయం ఖాయం: పృథ్వీ

పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలే - జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి: చంద్రబాబు - CHANDRABABU ON PENSIONS

ఎన్డీఏ కూటమి అద్భుత విజయం ఖాయం: ఈ ఎన్నికల్లో వైసీపీని మడతపెడతామనే మాటే అన్ని వర్గాల నోటా వినిపిస్తోందని పృథ్వీ అన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా ఎన్డీఏ కూటమి (NDA alliance) అధ్బుత విజయం ఖాయమని స్పష్టమవుతోందని అన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు నా చిప్ సరిగా పనిచేయక చంద్రబాబు, లోకేశ్​లపై విమర్శలు చేశానని అందుకు క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు.

నాకు కోవిడ్ వచ్చినప్పుడు బెడ్ అవసరమైతే అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. నేను ఒక సినిమాలో డాన్స్ చేస్తే సంబరాల మంత్రి తట్టుకోలేకపోయాడని అన్నారు. సంజన, సుకన్య అంటూ పరితపించే ప్రజా ప్రతినిధులు వైసీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే జగన్​ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

అన్నపై పోరుకు చెల్లెళ్లు 'సిద్ధం'!- నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం - YS Sharmila Election Campaign

175కి 175 అని విర్రవీగే టైమ్ అయిపోయింది: రాష్ట్రంలో వైసీపీ మొదటగా ఓడిపోయే సీటు రోజా పోటీ చేస్తున్న నియోజకవర్గం నగరేనని పృథ్వీ అన్నారు. నోరుంది కదా అని ఎలా పడితే అలా వాడేస్తే ఫలితం ఎలా ఉండబోతుందో త్వరలో రోజా చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175కి 175 అని విర్రవీగే జగన్ టైమ్ ఇక అయిపోయిందని అన్నారు. ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు కలిసి కట్టుగా రూపొందిస్తున్నామని, ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

సినీ పరిశ్రమ సమస్యలపై సచివాలయానికి చిరంజీవి వస్తే జగన్ అవమానించి పంపారని, చిరంజీవి పెద్దరికంగా ఆలోచిస్తారు కాబట్టి జగన్ చేసిన అవమానంపై స్పందించలేదని అన్నారు. వైసీపీ నేతల అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్​ - రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే - Former MLA Resigned YSRCP

Last Updated : Apr 5, 2024, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.