ETV Bharat / politics

రైతుబంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారు : హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 5:16 PM IST

Harish Rao Fire On Congress Party : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగరాలనీ మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఇవాళ భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు నెలలు గడుస్తున్నా రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేలు పింఛన్లు ఇవ్వలేదని విమర్శించారు. పింఛన్ హామీ అమలు చేసాకనే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలనీ కాంగ్రెస్​కు సవాలు విసిరారు.

Harish Rao Comments On Komatireddy Venkat Reddy
Harish Rao Fire On Congress

Harish Rao Fire On Congress Party : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగరవేయాలని, మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్​ఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ(2 Lakh Loan Waiver) చేయలేదని, 4 వేల రూపాయల పింఛన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఫింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని అధికార పార్టీ నాయకులకు సవాలు విసిరారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనన్న హరీశ్​రావు బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్​కు మాత్రమే ఉందన్నారు.

గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు: హరీశ్‌రావు

స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు తామే ఇచ్చామన్న ఆయన, ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో కాంగ్రెస్‌ పార్టీ జవాబు చెప్పాలన్నారు. భువనగిరి నియోజకవర్గ విసృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాము భువనగిరిలో ఓడిపోతామని అసలు అనుకోలేదని అభిప్రాయపడ్డారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Harish Rao Comments on Minister Komati Reddy : ఇటీవల జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి దుర్భాషాలాడిన తీరు హేయనీయమైనదిగా అభివర్ణించారు. రైతు బంధు(Rythu Bandhu ) అడగటం తప్పా అని హరీశ్​రావు నిలదీశారు. పోలీసులను పెట్టి జడ్పీ ఛైర్మన్​ను బయటికి పంపించారని, అధికారం ఉందని అహంకారంతో కోమటిరెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు వస్తాయా? లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించటం లేదని దుయ్యబట్టారు.

‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా కాంగ్రెస్ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల జారీ : హరీశ్‌రావు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీరిచ్చారనీ హరీశ్ ఆరోపించారు. ఆరోజు ఎందుకు మాట్లాడలేదని కోమటి రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం తగదనీ, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పని చేయండని హితవు పలికారు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్​కి(BRS Party) మాత్రమే ఉందని హరీశ్​రావు స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒకటేనని మరోసారి స్పష్టం చేశారన్నారు.

BRS Focus on Parliament Elections : ఆనాడు అదానీ, బీజేపీల గురించి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ, నేడు అదానీ చేత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారనీ దెప్పి పొడిచారు. గవర్నర్ కోటాలో(Governor Quota) రెండు ఎమ్మెల్సీల కోసం పేర్లు బీఆర్ఎస్ పంపిస్తే ఆమోదించలేదని, కానీ కాంగ్రెస్ పంపిన పేర్లను మాత్రం ఆమోదం చేసుకున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు 24 గంటల కరెంట్, ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేదనీ గుర్తు చేశారు. బీజేపీ వాళ్లు రాష్ట్రానికి ఏమీ ఇచ్చారో చెప్పాలనీ ప్రశ్నించారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని, తెలంగాణ హక్కుల కోసం గులాబీ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులలో నీటి వాటాలు తేల్చాలనీ బీఆర్​ఎస్ పార్టీ ఎంపీలే అడుగుతున్నారు తప్ప కాంగ్రెస్, బీజేపీ అడగలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుంది - హరీశ్​రావు

పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి - హామీల అమలు వాయిదా వేసే యత్నం: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.