పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి - హామీల అమలు వాయిదా వేసే యత్నం: హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 7:54 PM IST

BRS Activity for Parliament Elections 2024

Harish Rao Demands on Congress Six Guarantees Implementation : పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి హామీల అమలు వాయిదా వేసేందుకు, రేవంత్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మార్చి 17 తో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయన్న ఆయన, ఆలోపే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో హరీశ్​రావు పాల్గొని మాట్లాడారు.

Harish Rao Demands on Congress Six Guarantees Implementation : పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి హామీల అమలు వాయిదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరిట అధికారమెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల కోడ్​(Election Code) రాక ముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయన్న ఆయన, అప్పటికి పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందని తెలిపారు.

దావోస్​కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్​రావు

ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి సంబంధించి బీఆర్​ఎస్​ పార్టీ ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమీక్షకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి సహా పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికలపై నేతలు, కార్యకర్తల నుంచి నేతలు అభిప్రాయాలు స్వీకరించారు.

BRS Activity For Parliament Elections 2024 : ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్​రావు, కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నారన్నారు. ఉద్యమకారులు(Activists) మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్​కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని, గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా? అని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. 2009 లో పది సీట్లే వచ్చాయి, ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు.

'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్​తో దూసుకొస్తుంది : కేటీఆర్

ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్న ఆయన, భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని చెప్పారు. భవిష్యత్​లో వచ్చేది తామేనని అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్(Congress Govt) అభాసు పాలైందని, దీంతో అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని హరీశ్​రావు తెలిపారు. ఇక్కడ కూడా కాంగ్రెస్​కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్లు పావలా వంతుకు మించి అమలు చేయలేరని వ్యాఖ్యానించారు.

BRS Target on Malkajgiri Constituency : గత పార్లమెంట్​ ఎన్నికల్లో మల్కాజ్​గిరిలో తక్కువ ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని, ఒక్క పైసా నిధులు తేలేదని విమర్శించారు. సీఎం రేవంత్(CM Revanth) ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో ఈసారి గెలిచి సత్తా చాటాలని పేర్కొన్నారు. ఇది పరీక్షా సమయం అన్న హరీశ్​రావు, పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందన్న ఆయన, బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయని హరీశ్​రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్న ఆయన, రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను గెలిపించేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్

దావోస్​ పర్యటనలో ప్రకటనలకే పెట్టుబడులు - ఆచరణలో శూన్యం : ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.