ETV Bharat / politics

బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకో- జగన్​పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ - CM Jagan bus tour

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 10:41 PM IST

CM Jagan bus tour: సీఎం జగన్ ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడతారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.

CM Jagan bus tour
CM Jagan bus tour

CM Jagan bus tour: సీఎం జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర చేపట్టబోయే ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు నర్వహించి యాత్ర ప్రారంభిస్తారు. సీఎం జగన్ బస్సు యాత్రపై టీడీపీ నేతలు స్పందించారు. జగన్ చేపట్టిన బస్సుయాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకోవాలని ఆరోపించారు.

రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు: ఈ నెల 27 నుంచి వైసీపీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభిస్తారు.


జర్నలిస్టులపైనే దాడులు జరుగుతుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ? : జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రొద్దుటూరులో బహిరంగ సభ: సీఎం జగన్ 27వ తేదీ ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా కు బయలుదేరతారు. దువ్వూరు , చాగల మర్రి మీదుగా ఆళ్ళగడ్డకుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.


జగనన్న వస్తున్నాడు అందరూ సిద్ధంగా ఉండండి: పెద్దిరెడ్డి - Jagan Sidham Bus Yatra

85శాతానికి పైగా హామీలు: సీఎం జగన్ భస్సు యాత్ర సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారని బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారని వర్ల రామయ్య నిలదీశారు. హామీల అమలులో మోసం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. పాదయాత్ర, మేనిఫెస్టోలో జగన్ రెడ్డి 730కి పైగా హామీలిచ్చారని వర్ల గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో సుమారు 85శాతానికి పైగా హామీలు అమలు చేయలేదని వర్ల రామయ్య విమర్శించారు. సీఎం జగన్ చేపట్టబోయే బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకోవాలని వర్లరామయ్య ఎద్దేవా చేశారు.

జగనన్న వస్తున్నాడు అందరూ సిద్ధంగా ఉండండి: పెద్దిరెడ్డి - Jagan Sidham Bus Yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.