ETV Bharat / politics

ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్ల నిలిపివేత - అధికారులు ఇంటి వద్ద ఇవ్వలేరా?: చంద్రబాబు - CHANDRABABU PRAJAGALAM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 7:17 PM IST

Updated : Apr 3, 2024, 10:11 PM IST

Chandrababu Criticized YCP leaders: కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాసిరకం మద్యంతో సరఫరాతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Chandrababu criticized YCP leaders
Chandrababu criticized YCP leaders

Chandrababu Criticized YCP leaders: జగన్ తన సంపద కోసం నాణ్యత లేని మద్యాన్ని తయారు చేయిస్తున్నారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? అంటూ ప్రశ్నించారు. కోనసీమ జిల్లా కొత్తపేట ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను గంజాయి కేంద్రంగా మార్చారని, ఇటీవలే విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్‌ పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని దొంగలపరం చేస్తారా?, కాపాడుకుంటారా?: చంద్రబాబు

ప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే, వందకు వంద శాతం టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ నన్ను పశుపతి అన్నారని, పశుపతి అంటే శివుడు, ఆ మాటను నేను అంగీకరిస్తున్నాని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు: తాను వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్లు రాజకీయం చేయడానికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని, వారికి తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు. పింఛన్లు వచ్చే వరకు వృద్ధులు, దివ్యాంగులకు అండగా ఉండాలి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ - Chandrababu Fight on Pensions

ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి: రాష్ట్రంలో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు జగన్‌ ద్రోహం చేశారని ఆరోపించారు. ద్రోహం చేసిన జగన్‌కు రైతులు ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. ధాన్యం విక్రయించేందుకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రైతులు ఏపీలో ఉన్నారని, వైసీపీ హయాంలో రైతు చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీ: కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. కుల, మత రాజకీయాలు చేస్తే మరిచిపోతారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఆక్వా రంగం కుప్పకూలిందని, ఆక్వా రంగాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనలో మోసపోని వర్గం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీలకు సబ్‌ప్లాన్‌ అమలు చేసి పైకి తీసుకువస్తామన్నారు. వెనకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అనంతరం ద్రాక్షారామం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్​పై నిప్పులు చెరిగారు. జగన్ అందరినీ మోసగించారని, ఎవరినీ వదిలిపెట్టలేదని విమర్శించారు. వివేకాను చంపింది ఎవరో చెప్పి జగన్‌ ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పింఛన్లు ఆపి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికీ పింఛన్లు ఇవ్వకుండా నాటకాలాడుతున్నారని ఆరోపించారు. పింఛన్లు ఇవ్వడం చేతకాకపోతే జగన్‌ దిగిపోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచార జోరు - అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు - lok sabha Election Campaign

Last Updated : Apr 3, 2024, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.