ETV Bharat / offbeat

అమ్మాయిలూ- ఈ బ్యూటీ ప్రొడక్ట్స్​ రోజూ ఉపయోగించకూడదట! అవేంటో తెలుసా?

రోజూ ఈ సౌందర్య ఉత్పత్తులను వాడితే చర్మానికి హాని! -బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడకం విషయంలో నిపుణుల సూచనలు!

Beauty Products do not Use Everyday
Beauty Products do not Use Everyday (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2025 at 11:53 AM IST

3 Min Read
Choose ETV Bharat

Beauty Products do not Use Everyday : నలుగురిలో అందంగా కనిపించడానికి అమ్మాయిలు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్​ ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని రకాల కాస్మెటిక్​ ప్రొడక్ట్స్​ని రోజూ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే హానే ఎక్కువగా ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ ప్రొడక్ట్స్​ ఏంటి? వాటి వల్ల తలెత్తే సమస్యలేంటో? ఇప్పుడు చూద్దాం.

ప్రైమర్, డ్రై షాంపూ, డీప్ కండిషనర్, మెడికేటెడ్ లిప్‌బామ్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే కేశ సంబంధిత ఉత్పత్తులు, ఎక్స్‌ఫోలియేటింగ్ ప్రొడక్ట్స్​ ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయిలు సౌందర్య పోషణలో భాగంగా ఉపయోగించే ఉత్పత్తుల జాబితా పెద్దదే! అయితే కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం డైలీ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు సౌందర్య నిపుణులు.

Beauty Products
Beauty Products (Getty Images)

డీప్ కండిషనర్ :

పొడిబారిన జుట్టుకు తేమనందించి తిరిగి నార్మల్​ స్థాయికి తెచ్చేందుకు డీప్ కండిషనర్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని డైలీ వాడడం వల్ల కురులు పొడిబారిపోతాయట! జుట్టులో ఉండే పీహెచ్ స్థాయులపై కండిషనర్ ప్రభావం చూపడం వల్లే ఇలా జరుగుతుందంటున్నారు నిపుణులు. అందుకే దీనికి బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది.

వాటర్‌ప్రూఫ్ మస్కారా :

ఐ మేకప్‌లో భాగంగా వాటర్‌ప్రూఫ్ మస్కారాను ఉపయోగిస్తున్నట్లయితే కాస్త అలర్ట్​గా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది కనుబొమ్మల్లో ఉండే సహజసిద్ధమైన తేమని తగ్గించి అవి పొడిబారిపోయేలా కూడా చేస్తుందట! కాబట్టి వాటర్‌ప్రూఫ్ మస్కారాను కూడా రోజూ ఉపయోగించకూడదు. మరీ అవసరం అనుకుంటే ముందుగా నార్మల్​ మస్కారా ఒక కోటింగ్ అప్లై చేసుకున్న అనంతరం దాని మీద వాటర్‌ప్రూఫ్ మస్కారా అప్లై చేసుకోవచ్చు. అయితే నైట్​ పడుకొనే ముందు మాత్రం దీనిని తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది.

ప్రొటీన్ ప్రొడక్ట్స్​ :

జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు కొంతమంది అమ్మాయిలు. అయితే వీటిని కూడా డైలీ ఉపయోగించడం సరికాదంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రొటీన్లు ఎక్కువైతే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. కేశాల్లో సహజసిద్ధంగా ఉండే తేమ స్థాయులపై ప్రొటీన్ ప్రొడక్ట్స్​ ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణమట! కాబట్టి ఈ తరహా ఉత్పత్తులను డైలీ వాడకుండా నిపుణుల సలహా మేరకు అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

ప్రైమర్ :

మేకప్ ఎక్కువ టైమ్ ఉండాలన్నా, మంచి లుక్ రావాలన్నా ప్రైమర్ కచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే. అయితే దీనిని డైలీ ఉపయోగించడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు. ఎందుకంటే ప్రైమర్లో ఉండే సిలికాన్ చర్మగ్రంధులను మూసుకుపోయేలా చేస్తుంది. అలాగే స్కిన్ పొడిబారేలా చేస్తుంది. కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనిని వాడడం మంచిది. అలాగే ప్రైమర్ ఉపయోగించిన ప్రతిసారీ అది పూర్తిగా తొలగిపోయే వరకు క్లీన్​ చేసుకోవాలని గుర్తుంచుకోండి.

డ్రై షాంపూ :

తలస్నానం చేసే టైమ్​ లేకపోయినా, తక్కువ టైమ్​లో కేశాలను పట్టులా కనిపించేలా చేయాలన్నా డ్రై షాంపూని ఉపయోగిస్తారు. అయితే దీనిని కూడా డైలీ ఉపయోగించకూడదట! వరుసగా రెండు రోజులకు మించి డ్రై షాంపూని వాడడం మంచిది కాదని నిపుణులంటున్నారు. ఇలా చేయడం వల్ల హెయిర్​ నిర్జీవంగా తయారై ఎక్కువ జుట్టు ఊడిపోతుంది. అలాగే దీనిని ఉపయోగించిన అనంతరం కూడా షాంపూతో తలస్నానం చేసి నాణ్యమైన కండిషనర్ అప్లై చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

స్క్రబ్ :

స్క్రబ్ చేయడం వల్ల స్కిన్​పై పేరుకొన్న మృతకణాలు, మలినాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. అలాగే మెరిసిపోతూ కనిపిస్తుంది. అలాగని డైలీ స్క్రబ్ చేస్తే కలిగే ప్రయోజనాల కంటే హానే ఎక్కువగా ఉంటుందట! ఈ క్రమంలో స్కిన్​ పొడిబారడం, నిర్జీవంగా మారడం, ఎరుపెక్కడం, పెళుసుబారడం మొదలైన లక్షణాలు కనిపిస్తే ఎక్స్‌ఫోలియేషన్‌కి సంబంధించిన ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే స్క్రబ్‌ని వారానికి 2 లేదా మూడుసార్లకు మించి ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు.

వీటన్నింటితో పాటు పెట్రోలియం జెల్లీ, హెవీ కాంటూరింగ్, మ్యాటీ లిప్‌స్టిక్, మెడికేటెడ్ లిప్‌బామ్స్ మొదలైన ఉత్పత్తులు కూడా డైలీ ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు.

మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​!

కూరల్లో టమాటాలు వేస్తే మొటిమలు రావనేది నిజమేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!