ETV Bharat / international

అమెరికాలో మళ్లీ హింస- కాల్పుల్లో 8మంది మృతి- నిందితుడి ఆత్మహత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:35 AM IST

Updated : Jan 23, 2024, 12:03 PM IST

US Shooting Today : అమెరికాలో ఓ దుండగుడు వేర్వేరు ఇళ్లపై కాల్పులు జరిపి 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. రెండు రోజుల పాటు కాల్పులు జరిపిన అతడు- పక్క రాష్ట్రానికి పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అడ్డగించగా- నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు.

Chicago Illinois Shooting
Chicago Illinois Shooting

US Shooting Today : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. ఇల్లినాయీ రాష్ట్రంలోని జోలియెట్ పట్టణంలో ఆది, సోమవారాల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడని టెక్సాస్ అధికారులు సోమవారం తెలిపారు. షికాగోకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. నేరం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే నిందితుడి నివాసం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అంతకుముందు, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. నిందితుడిని రోమియో నాన్స్​గా పోలీసులు గుర్తించారు. మృతులతో అతడికి ఇదివరకే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచి అతడు కాల్పులు జరుపుతున్నప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడటం గమనార్హం.

పోలీసుల నుంచి తప్పించుకు తిరిగిన రోమియో నాన్స్ ఇంటర్​స్టేట్ హైవే మీదుగా టెక్సాస్​లోకి ప్రవేశించాడని అధికారులు తెలిపారు. 'అంతర్​రాష్ట్ర హైవే మీదుగా నిందుతుడు టెక్సాస్​లోకి ప్రవేశిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఓ గ్యాస్ స్టేషన్ వద్ద అతడిని అడ్డగించగా పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. చివరకు నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు' అని టెక్సాస్ పోలీసు అధికారులు తెలిపారు.

నాన్స్ గతంలో ఆయుధాల దుర్వినియోగం కేసులో అరెస్టయ్యాడని స్థానిక మీడియా తెలిపింది. 2023లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న అతడు పూచీకత్తుపై బయట తిరుగుతున్నాడని కోర్టు రికార్డుల ద్వారా తెలిసింది. ఆ కేసులో ఇంకా విచారణ పూర్తి కాలేదని సమాచారం.

విచక్షణారహిత కాల్పులు
గతేడాది అక్టోబర్​లో అమెరికాలోని మైనే రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 18 మంది చనిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతాలపై సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. దుండగుడి కాల్పుల్లో మరో 13 మంది వరకు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని రాబర్ట్ కార్డ్​గా పోలీసులు గుర్తించారు. అతడు సెమీ ఆటోమెటిక్ రైఫిల్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా మిలిటరీలో అతడు పనిచేసినట్లు వివరించారు. ఆయుధాల శిక్షకుడిగా అతడు పని చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో అతడు గృహ హింస కేసులో అరెస్టై విడుదలయ్యాడు. గతేడాది ఆరంభంలో లెవిస్టన్ నగరంలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కార్ పార్కింగ్​ కోసం గొడవ- గన్​ షూటింగ్, మూక దాడిలో నలుగురు మృతి

నైజీరియాలో కాల్పుల కలకలం- 160 మంది మృతి, మరో 300మందికి గాయాలు

Last Updated : Jan 23, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.