ETV Bharat / health

అలర్ట్​: రాత్రంతా AC ఆన్​ చేసే నిద్రపోతున్నారా? - ఈ ముప్పు తప్పదు! - Air Conditioner Side Effects

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 2:12 PM IST

Side Effects of Air Conditioners: సమ్మర్‌ వచ్చిందంటే చాలు ఏసీ ఉన్న ఇళ్లలో 24 గంటలు ఆన్​లోనే ఉంటుంది. అయితే.. ఇలా రాత్రంతా ఏసీ ఆన్​లోనే ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Air Conditioner Side Effects
Air Conditioner Side Effects

Air Conditioner Side Effects: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనం అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నకూడా ఎండ కారణంగా వచ్చే వేడి(Summer) తట్టుకోలేక కూలర్లు, ఎయిర్ కండిషనర్లను(ఏసీ) ఆశ్రయిస్తున్నారు. అయితే.. చాలా మంది ఆఫీసులో రోజంతా ఏసీలోనే ఉంటారు. ఇంట్లో కూడా రాత్రంతా ఏసీలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

శ్వాసకోశ సమస్యలు: రాత్రంతా ఏసీ ఆన్​ చేసి నిద్రపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు ఏసీలో ఉండే వారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. గొంతు పొడిబారడం, రినిటిస్, నాసికా అడ్డుపడటం వంటి సమస్యలతో బాధపడవచ్చని హెచ్చరిస్తున్నారు. రినిటిస్ అనేది ముక్కు శ్లేష్మ పొరలలో వాపును ప్రోత్సహించే ఒక పరిస్థితి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ ప్రతిచర్య కారణంగా జరుగుతుంది.

2016లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రంతా ఏసీలో గడిపే వ్యక్తుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ప్రముఖ శ్వాసకోశ వైద్యుడు, హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​లో ప్రొఫెసర్​ అయిన డాక్టర్ డేవిడ్​ డో పాల్గొన్నారు. ఏసీని రోజుకు 4 గంటల కంటే ఎక్కువ ఉపయోగించే వ్యక్తులకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 80% ఎక్కువున్నట్లు ఈయన తెలిపారు.

మీ వయసు 30 దాటుతోందా? - మీ బాడీలో ఈ విటమిన్స్ తగ్గిపోతే అంతే! - Vitamins for Mens after 30 Years

కళ్లు పొడిబారడం: సాధారణంగా ఏసీ వాతావరణంలో గాలిలో తేమ అనేదే ఉండదు. కానీ కళ్లకు తేమ లాంటి వాతావరణం అవసరం. ఏసీ ఉన్న గదిలో తేమ లేకపోవడం వల్ల కళ్లలోనూ మాయిశ్చర్ కనుమరుగై కళ్లు పొడిబారిపోతాయి. ఫలితంగా కళ్లు మంటగా, దురదగా అనిపిస్తాయి. ఇంకొన్నిసార్లు దృష్టి మసకబారడం జరుగుతుంది.

పొడి చర్మం: రాత్రంతా ఏసీలో ఉంటే చర్మం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.

తలనొప్పి: రాత్రంతా ఏసీలో ఉన్నా.. ఏసీ గదిలో ఎక్కువ సమయం గడిపినా.. డీహైడ్రేషన్‌కు గురై తలనొప్పి, మైగ్రేన్‌ ఇబ్బంది పెడతాయి. డీహైడ్రేషన్‌ మైగ్రేన్‌ను ట్రిగ్గర్‌ చేస్తుంది. ఏసీ గదుల్లోకి అడుగు పెట్టినప్పుడు, ఎక్కువసేపు ఏసీలో ఉన్న తర్వాత హఠాత్తుగా బయట వెళ్లినా మీకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏసీ గదుల నిర్వహణ సరిగా లేకపోయినా.. తలనొప్పి, మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.​

2018లో ఆనల్స్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఇండోర్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులలో తలనొప్పి ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఇండోర్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులకు నెలకు 1 నుంచి 3 రోజులు తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువని.. 8% మంది ఉద్యోగులు రోజూ తలనొప్పితో బాధపడుతున్నట్లు నివేదించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ రాజేష్​ కుమార్​ పాల్గొన్నారు.

మయొనైజ్‌ ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు! - Mayonnaise Health Effects

అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్​ ఇలా టెస్ట్​ చేసుకోండయ్యా! - How to Check the Purity of Salt

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.