ETV Bharat / health

రోజూ పరోటాలు తింటున్నారా ? - అయితే, మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ? - Maida Side Effects

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 3:48 PM IST

Maida Side Effects : ప్రస్తుత కాలంలో మైదా పిండితో తయారు చేయని ఆహార పదార్థాలు దొరకడం కష్టమే! ఎందుకంటే, ఉదయం మనం తినే పరోటాల నుంచి మొదలు పెడితే సాయంత్రం తినే సమోసా వరకు చాలా ఫుడ్‌ ఐటమ్స్‌లో మైదా పిండిని వాడుతున్నారు. అయితే, మీకు రోజూ మైదా పిండితో తయారు చేసే పరోటాలు తింటే ఏమవుతుందో తెలుసా?

Maida Health Problems
Maida Health Problems

Maida Health Problems : మనలో చాలా మంది పరోటాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని మైదాపిండితో తయారు చేస్తారని అందరికీ తెలుసు. అయితే, మైదాపిండితో కేవలం పరోటాలు మాత్రమే కాకుండా.. బిస్కెట్లు, పఫ్స్, రోల్స్‌, నూడుల్స్‌, మంచూరియా, సమోసా వంటి వివిధ ఆహార పదార్థలను తయారు చేస్తారు. రోజూ వీటిని తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇంతకీ ఈ మైదాపిండిని ఎలా తయారు చేస్తారు ? పరోటాలను రోజూ తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటీ ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మైదాపిండిని ఎలా తయారు చేస్తారంటే?

గోధుమలకు ఉండే పైపొట్టును తొలగించి.. వాటిని బ్రౌన్‌ కలర్‌ గోధుమలు, పాలిష్డ్ గోధుమలు అనే రెండు రకాలుగా చేస్తారు. బ్రౌన్‌ కలర్‌లో ఉన్న వాటిని గోధుమలుగా పిలుస్తారు. వీటిని వివిధ రకాల పద్ధతులతో బ్రౌన్‌ కలర్‌ తీసేసి మెత్తని పిండిలాగా చేస్తారు. దానినే మైదా పిండి అని పిలుస్తారు. అయితే, మైదా పిండిని తయారు చేసేటప్పుడు కొద్దిగా బ్లీచింగ్‌ వాడుతారట. దీని వల్ల పిండి తెల్లగా ఉంటుందని నిపుణులంటున్నారు.

అన్నింట్లో కలుపుతారు : మనం గోధుమలతో తయారు చేశారని ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్, బిస్కెట్ల వంటి వాటిలో కూడా కొద్ది మొత్తంలో మైదా పిండిని కలుపుతారట! కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. కేవలం గోధుమ పిండితో వీటిని తయారు చేయడం సాధ్యం కాదని నిపుణులంటున్నారు. అయితే, మైదా పిండితో చేసిన పరోటాలను తినడం కంటే, గోధుమ పిండితో చేసిన చపాతీలను 5-6 తినడం మంచిదని తెలియజేస్తున్నారు. అలాగే, మార్కెట్లో దొరికే బ్రెడ్‌, బిస్కెట్ల వంటి వాటిని తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట జ్వరం తరచూ ఇబ్బంది పెడుతుందా? లైట్​ తీసుకోవద్దు- ఈ జాగ్రత్తలు మస్ట్​!

వీరు పరోటాలు తినకూడదు!

మధుమేహం ఉన్నవారు : షుగర్‌ వ్యాధితో బాధపడేవారు రోజూ పరోటాలు తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులంటున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పరిశోధన వివరాలు : 2017లో 'డయాబెటిస్ కేర్' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహం ఉన్నవారు ఒక వారం రోజుల పాటు పరోటాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చెన్నైలోని " మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్"లో పనిచేసే డాక్టర్ వి. మోహన్ పాల్గొన్నారు. మధమేహంతో బాధపడేవారు రోజూ పరోటాలు తినడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ పెరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

బరువు తగ్గాలనుకునే వారు : పరోటాలను తయారు చేయడానికి ఎక్కువగా నూనెను ఉపయోగిస్తారు. అయితే, దీనివల్ల పరోటాలలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. రోజూ ఎక్కువగా పరోటాలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందట. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. ఎక్కువ బరువు ఉన్న మహిళలు మైదాతో చేసిన పదార్థాలను తినకపోవడం మంచిదట. ఎందుకంటే.. వీటిని తినడం వల్ల ఇంకా బరువు పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్స్‌ ఆలస్యంగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెల రోజుల పాటు కాఫీ, టీ తాగకపోతే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Stop Drinking Tea Coffee Benefits

కూరలో మసాలా ఎక్కువైందా? డోంట్​ వర్రీ- ఈ ఇంటి చిట్కాలతో అంతా సెట్​! - Reduce Spiciness Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.