ETV Bharat / health

మిమ్నల్ని తరచుగా కడుపు నొప్పి బాధిస్తోందా? - ఈ టిప్స్​తో అంతా సెట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 11:31 AM IST

Updated : Mar 6, 2024, 11:36 AM IST

How To Stop Stomach Pain : కొంతమంది కడుపునొప్పి సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కడుపు నొప్పి వల్ల కొంతసేపటి వరకు ఏ పనుల మీద దృష్టి సారించలేరు. ఇలాంటి వారు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? దానిని ఏవిధంగా నివారించుకోవచ్చు అనే విషయాలపై ప్రముఖ చీఫ్ క్లీనికల్ న్యూట్రిషనిస్ట్ మధులిక ఆరుట్ల సూచనలు మీ కోసం.

How To Stop Stomach Pain
How To Stop Stomach Pain

How To Stop Stomach Pain : కడుపు నొప్పి సమస్యకు వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా కడుపునొప్పి ఎవరికైనా రావచ్చు. అయితే కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చని చీఫ్ క్లీనికల్ న్యూట్రిషనిస్ట్​ మధులిక ఆరుట్ల చెబుతున్నారు. 'చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఇది తీవ్రమైనప్పుడు కడుపునొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది ఒత్తిడికి లోనైనప్పుడు కూడా కడుపునొప్పికి గురికావచ్చు. కొన్నిసార్లు రుతుస్రావం సమయంలో కూడా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కడుపునొప్పిని ప్రేరేపించే కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాలి.' అని డా.మధులిక ఆరుట్ల వివరిస్తున్నారు.

ఈ ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోండి
Stomach Pain Foods To Avoid : తరుచూ కడుపునొప్పితో బాధపడే వారు పాలను తీసుకోవడం తగ్గించుకోవాలి. పాలలోని ల్యాక్టోజ్ అనే ప్రోటీన్ వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే పప్పులు, శనగలను కూడా తగ్గించుకోవడం మంచిదని చీఫ్ క్లీనికల్ న్యూట్రిషనిస్ట్​ మధులిక చెబుతున్నారు.

రుతుస్రావం సమయంలో
రుతుస్రావం సమయంలో కూడా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే చాలామంది రుతుస్రావం జరిగే సమయంలో కడుపునొప్పి నుంచి ఉపశమనం కోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా ఫైబర్ తీసుకున్నా కొన్నిసార్లు కడుపు నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి.

కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి వైద్యుల సూచనలు ఇవే!
కడుపు నొప్పి వేధిస్తున్నప్పుడు నీళ్లను తీసుకోవడం ఉత్తమం. అయితే ఒకేసారి కాకుండా ఒక క్రమపద్ధతిలో కొద్ది పరిమాణంలో నీటిని తీసుకోవడం ఉత్తమం. నీటిలో కాస్త జీలకర్రను కలుపుకొని తాగితే మంచిది. లేకపోతే జీలకర్ర పొడిని కలుపుకొని తాగినా కడుపు నొప్పి తగ్గుతుంది. నీటిలో సోంప్ కలిపి తాగినా లేదా సోంప్ నీటిని తాగినా మేలు కలుగుతుంది. నీటిలో కొన్నిచుక్కల నిమ్మరసం కలుపుకొని తాగినా మంచి ఫలితాలుంటాయి.

ఒత్తిడిని ఇలా దూరం చేసుకోండి : కడుపునొప్పి రావడానికి కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. తీవ్రమైన ఒత్తిడి కడుపు నొప్పితో పాటు అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణం అవుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకోవడాని బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చెయ్యడం ఉత్తమం. ఇందుకోసం ముక్కు ద్వారా గాలిని పీలుస్తూ, నోటి ద్వారా గాలిని బయటకు వదలడం చెయ్యాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ ఉడికించిన గుడ్డు తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

Last Updated : Mar 6, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.