ETV Bharat / health

మందు బాబులకు అలర్ట్ - లివర్​ దెబ్బతినొద్దంటే ఆల్కహాల్ ఆ లిమిట్ దాటొద్దంట! - How Much Alcohol Can Damage Liver

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 4:46 PM IST

How Alcohol Impacts Liver : ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలా మంది మద్యం సేవిస్తూనే ఉంటారు. ఇలా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బాడీలో డ్యామేజ్ అయ్యే మొదటి పార్ట్.. లివర్. అయితే.. వాస్తవానికి ఎంత కొద్దిగా తాగినప్పటికీ లివర్ దెబ్బ తింటుందని చెబుతున్న నిపుణులు.. ఆ తీవ్రతను తగ్గించడానికి ఒక లిమిట్ సూచిస్తున్నారు. మరి.. అది ఎంతో మీకు తెలుసా?

How Much Alcohol Can Damage Liver
How Alcohol Impacts Liver (ETV Bharat)

How Much Alcohol Can Damage Liver : మద్యం సేవించడం.. మొదట సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత అలవాటుగా మారుతుంది.. చివరకు వ్యసనమై వేధిస్తుంది.. శరీరాన్ని రోగాలపుట్టగా మారుస్తుంది. అయినప్పటికీ చాలా మంది మద్యపానాన్ని మానుకోలేరు. డైలీ తీసుకోవడానికి అలవాటుపడిపోతారు. ఎంత తీసుకుంటున్నామనే విషయంలో క్లారిటీ ఉండదు. నియంత్రణ లేకుండా ఎంతపడితే అంత తాగేస్తుంటారు. ఇలా ఆల్కహాల్ సేవించడం వల్ల బాడీలో మొదట దెబ్బతినే అవయం.. కాలేయం(Liver). అయితే, మీ లివర్ డ్యామేజ్ తీవ్రత తగ్గించాలంటే డైలీ ఎంత మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవాలో మీకు తెలుసా?

ఏ రకం ఆల్కహాల్ అయినా.. ఎంత పరిమాణంలో తీసుకున్నా కాలేయానికి ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఇది కూడా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ప్రమాదకరం అని చెబుతున్నారు. కాబట్టి.. రోజుకు 30 ఎంఎల్ మించకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. రోజుకు 80 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా కాలేయం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

2018లో 'British Medical Journal ఓపెన్' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగే వ్యక్తులకు కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం 2 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గాయ్-యూన్ లిన్ పాల్గొన్నారు. డైలీ 30 మిల్లీ లీటర్ల కంటే అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇలా తాగాలి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందు తాగగానే అది కడుపు, చిన్నపేగుల ద్వారా బ్లడ్​లో కలుస్తుంది. ఖాళీ కడుపుతో కనక తాగినట్లయితే అది కొద్ది నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోతుంది. కాబట్టి.. ఖాళీ కడుపుతో అస్సలే తాగకూడదని సూచిస్తున్నారు. దాంతోపాటు తాగుతున్నప్పుడు ఇతర ద్రవపదార్థాలు, మంచి ఆహారం తీసుకుంటే.. మద్యం రక్తంలో కలిసే ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతుందంటున్నారు.

అలర్ట్ : మద్యంలో సోడా మిక్స్​ చేస్తే జరిగేది ఇదే! - వైద్యుల హెచ్చరిక!

లివర్​లో చేరిన ఆల్కహాల్‌తో అక్కడి ఎంజైమ్స్‌ చర్య జరిపి దాన్ని ఎసెటాల్‌డిహైడ్‌గా మారుస్తాయట. ఇది పెద్దమొత్తంలో ఉంటే విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు లివర్​ వెంటనే అప్రమత్తమై.. ఎక్కువ పని చేస్తుందట. తద్వారా ఆ విషాన్ని శరీరం నుంచి బయటకు పంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితి రోజూ ఉంటే.. కాలేయం పని చేయలేక అలిసిపోతుంది. అయినా అతిగా మద్యం సేవిస్తూనే ఉంటే.. బయటికి పోగా మిగిలిన మందు మొత్తం కొవ్వులా పేరుకుపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో క్యాన్సర్లు కూడా పుట్టొకొస్తాయని.. చివరకు లివర్​ సిరోసిస్ స్టేజ్ వస్తుందని చెబుతున్నారు. ఈ దశలో లివర్ పని చేయడం దాదాపుగా ఆగిపోయే స్థితికి వస్తుందని.. ఇది జరిగితే మరణం అంచుకు చేరినట్టేనని అంటున్నారు. అందుకే.. మద్యం తాగొద్దని చెబుతున్నారు. తప్పని పరిస్థితి అయితే 30 ఎంఎల్​ దాటకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా మందు తాగకుండా ఉండలేకపోతున్నారా? - ఇలా చేస్తే ఇక ముట్టుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.