ETV Bharat / health

సమ్మర్​లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? - ఈ టిప్స్​తో తొలగించుకోవడం వెరీ ఈజీ! - Dark Circles Under Eyes Remove Tips

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 9:37 AM IST

Dark Circles Under Eyes Remove Tips: మీరు సమ్మర్​లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్​తో ఇబ్బందిపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే, ఓసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. నల్లటి మచ్చలకు ఈజీగా చెక్ పెట్టడమే కాకుండా.. మీ ఫేస్ మిలమిలా మెరిసిపోవడం పక్కా అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips to Remove Under Eye Dark Circles
Dark Circles Under Eyes Remove Tips (ETV Bharat)

Best Tips to Remove Under Eye Dark Circles: అందంగా కనిపించడంలో కళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. కానీ.. చాలా మంది 'కళ్ల కింద నల్లటి వలయాల' సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక సమ్మర్​లో ఈ డార్క్ సర్కిల్స్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాసేపు ఎండలో తిరిగినా సరే కొంతమందిలో కళ్ల కింద ఉబ్బినట్లు, నల్లటి సర్కిల్స్ లేదా మచ్చలు కనిపిస్తుంటాయి. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే డోంట్​వర్రీ.. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీ కళ్లు మునుపటి రూపును సొంతం చేసుకొని అందంగా మెరిసిపోవడం ఖాయమంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టమాట: చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో టమాట కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే కంటి కింద నల్లటి వలయాలను తొలగించడంలో టమాటలోని పోషకాలు చాలా చక్కగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. ఇందుకోసం కొంచెం టమాట రసం తీసుకొని అందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయంటున్నారు నిపుణులు. లేదంటే కేవలం నిమ్మరసాన్ని డైలీ రెండుసార్లు కళ్ల కింద అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

టీ బ్యాగ్స్‌ : కళ్ల కింద డార్క్ సర్కిల్స్​ను పోగొట్టడంలో టీ బ్యాగ్స్ చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం టీ బ్యాగ్స్​ను పది నిమిషాల పాటు ఫ్రిజ్​లో ఉంచుకోవాలి. ఆపై వాటిని తీసుకొని కళ్లపై 15 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్ అవ్వడం ద్వారా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్ క్రమంగా తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

బాదం నూనె : మీరు కళ్ల కింద నల్లటి మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా? అయితే బాదం నూనెను ఇలా యూజ్ చేశారంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ నైట్ నిద్రించే ముందు కాస్త బాదం ఆయిల్​ను తీసుకుని కళ్ల చుట్టూ రాసుకోవాలి. అలాగే కాసేపు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. డైలీ ఈవిధంగా చేయడం ద్వారా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్ తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే రోజ్​వాటర్​తో ఇదే విధంగా చేసినా మంచి ఫలితం పొందవచ్చంటున్నారు.

2019లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 4 వారాల పాటు కంటి కింద బాదం నూనె​ను ఉపయోగించిన వారిలో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్. జాన్​ డో పాల్గొన్నారు. కళ్ల కింద బాదం నూనె అప్లై చేయడం వల్ల అందులోని పోషకాలు నల్లటి మచ్చలను పోగొట్టి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్​ - ఈ ఫుడ్​తో ఈజీగా చెక్ పెట్టండి!

కీరా లేదా బంగాళదుంప : ఇవి కూడా కళ్ల కింద క్యారీ బ్యాగులను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం చల్లటి కీరా లేదా బంగాళదుంప ముక్కల్ని తీసుకుని 15-20 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేశాక గోరువెచ్చని వాటర్​తో ముఖాన్ని శుభ్రం చేసుకొని క్రీం అప్లై చేసుకోవాలంటున్నారు నిపుణులు. డైలీ రాత్రి నిద్రించే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అలాగే.. కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో బంగాళదుంప పొట్టు, రసం కూడా చాలా చక్కగా పనిచేస్తాంటున్నారు నిపుణులు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

  • కొందరు పదేపదే కళ్లను నలుపుతుంటారు. దీనివల్ల కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి వీలైనంత వరకు కళ్లను పదేపదే నలపకుండా జాగ్రత్తపడాలంటున్నారు.
  • అలాగే.. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు. వీటికి దూరంగా ఉండడం వల్ల ఐ డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గడమే కాదు.. బాడీకి మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ వచ్చాయా? నిద్రలేకపోవడమే కాదు, ఇవీ కారణాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.