ETV Bharat / health

మీ పిల్లలు బరువు పెరగట్లేదా? - ఈ ఫుడ్స్ తినకపోవడమే కారణం! - Weight Gain Foods For Children

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 11:55 AM IST

Foods to Kids Weight Gain : సాధారణంగా పిల్లలు ఎదిగే కొద్దీ బరువు కూడా పెరుగుతుంటారు. కానీ, కొంతమంది చిన్నారులు మాత్రం వయసుకు తగినట్టుగా బరువు పెరగరు. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? అయితే, వారి డైట్​ మార్చాల్సిందే అంటున్నారు నిపుణులు!

Kids Weight Gain
Foods to Kids Weight Gain

Best Foods to Kids Weight Gain : నేటితరం పిల్లలు ఎక్కువగా జంక్​ఫుడ్స్ తీసుకుంటున్నారు. వాటిలో పోషకాలు లేకపోగా.. పలు ఆరోగ్య సమస్యలూ తలెత్తే అవకాశం ఉంటుంది. పిల్లలు వయసుకు తగ్గ బరువు(Weight) ఉండకపోవడానికి ఇది కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీ పిల్లలు ఉంటే.. వెంటనే వారి డైట్ మార్చేయాలని సూచిస్తున్నారు.

పిల్లలు ఎదిగే క్రమంలో సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. ఈ టైమ్​లో అందించే ఫుడ్ వారి శారీరకంగా, మానసిక ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కాబట్టి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వయసుకు తగ్గ బరువు పెరగాలన్నా.. వారి డైట్​లో సరైన పోషకాహారం ఉండేలా చూసుకోవాలంటున్నారు. చాలా మంది పిల్లలు స్కూల్​కి వెళ్లేటప్పుడు టైమ్ అవుతుందనో, ఇంకేదైనా కారణం చేతనో టిఫిన్ తినడం మానేస్తుంటారు. కానీ, పిల్లలు ఎదిగే క్రమంలో అల్ఫాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. అది రోజు మొత్తానికి కావాల్సిన పోషకాలనూ, శక్తినీ అందిస్తుంది. అయితే, ఆ టిఫిన్​లో కూడా తగిన పోషకాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు.

మీ పిల్లలకు టిఫిన్​గా ఇడ్లీ, దోసె పెడుతున్నట్లయితే.. క్యారెట్‌ తురుము, బఠాణీలనీ ఇడ్లీపిండిలో కలిపి ఉడికిస్తే మంచిదట. అలాగే.. దోసె పిండిలో కాయగూరలు, ఆకుకూరలు కలిపి వేస్తే కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. వీటితో పాటు డైలీ గుడ్డు, పాలు కూడా ఇవ్వాలి. అదేవిధంగా రోజూ ఒక కప్పు సీజనల్‌ పండ్లను ఇవ్వాలి. చిరుతిండిగా నట్స్‌ పెట్టేలా చూసుకోవాలి. వీలైనంత వరకు మోతాదుకి మించకుండా మూడుపూటలా ఆహారం, రెండుసార్లు స్నాక్స్‌ అందేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్ లతాశశి.

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

అదేవిధంగా మీ పిల్లల మధ్యాహ్న భోజనంలో చపాతీ లేదా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌రైస్‌, కిచిడీ పెడితే మంచిది అంటున్నారు వైద్యురాలు. సాయంత్రం పూట ఫ్రూట్‌మిల్క్‌షేక్‌ను ఇవ్వడం ద్వారా మంచి పోషకాలను అందించినవారవుతారు. అలాగే వీటికి బదులుగా.. ఉడికించిన శనగలు, బొబ్బర్లు, పెసర్లను సలాడ్‌ రూపంలో పెట్టొచ్చు. వీటితోపాటు మరమరాలూ, అటుకులనూ చిరుతిండిగా ఇవ్వొచ్చని చెబుతున్నారు.

పిల్లలకు రాత్రి భోజనంలో కాయగూరలతో పాటు పప్పు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. అదే మీ చిన్నారులు మాంసాహారులైతే చేప, గుడ్డు, చికెన్‌, మటన్‌లను ఆహారంలో చేర్చండి. వీటి నుంచి మీ బుజ్జాయిలకు కావల్సిన ప్రొటీన్‌ లభిస్తుందని చెబుతున్నారు డాక్టర్ లతాశసి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మీ పిల్లలకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందించాలనేది వారి ప్రస్తుత బరువు మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మరవొద్దు. ఇందుకోసం పోషకాహార నిపుణులను సంప్రదించి ఆహార నియమాలను పాటిస్తే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లల్లో మెమరీ పవర్​ పెరగాలా? - డైలీ ఈ యోగాసనాలు వేస్తే వారికి తిరుగుండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.