ETV Bharat / health

మీకు ఆస్తమా ఉందా? - అయితే వీటి జోలికి పోవద్దంటున్న నిపుణులు!

- ఆస్తమా రోగులు వీటిని తినకూడదట - శ్వాస తీసుకోవడం కష్టంగా మారే ఛాన్స్ ఉందట!

Asthma_Patients_Avoid_This_Food
Asthma_Patients_Avoid_This_Food (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : May 17, 2025 at 7:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Asthma Patients Should Always Avoid This Food : ప్రస్తుతం ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. ఆస్తమా ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. ఈ వ్యాధి వల్ల కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, నిద్రలో అంతరాయం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే ఆస్తమాతో బాధపడేవారు మందులు వాడటంతో పాటు తినే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి అవసరం ఉంది. కొన్ని పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

టీ, కాఫీకి దూరంగా : రోజు ఉదయం, సాయంత్రం టీ, కాఫీ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీటిలో కెఫిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల హృదయ స్పందన రేటు వేగంగా మారిపోవచ్చు, దీంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కెఫిన్ అనేది మరింత తీవ్రతరం చేయవచ్చనని తెలిపారు.

ఆస్తమా
ఆస్తమా (Getty image)

చల్లని పదార్థాలు తినవద్దు : వంట చేయడానికి తాజా ఆహార పదార్థాలు అవసరమే. కానీ ఫ్రీజర్​లో నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు, పచ్చళ్లు అనేవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎలర్జీ ప్రభావం పెంచడంతో పాటు శ్వాసనాళాలు బిగుసుకుపోవడానికి కారణమవుతుందని పేర్కొన్నారు. చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ లాంటివి తాగడం వల్ల గొంతు చల్లబడుతుంది, కానీ ఆస్తమా బాధితులకు ప్రమాదకరమని వివరించారు.

ఐస్ క్రీం
ఐస్ క్రీం (Getty image)

ఆస్తమా బాధితులు చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల గొంతులో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. చల్లని, తీపి ఐస్ క్రీం గొంతు సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చనని వివరించారు. దీనితో పాటు, గొంతులో శ్లేష్మం పెరగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని వీటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను నివారించండి : పిజ్జా, బర్గర్ లాంటి వంటి ఆహారాలు ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కెమికల్స్ వాడతారని నిపుణులు పేర్కొన్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరచడంతో పాటు శ్వాస సమస్యను మరింత కష్టతరం చేస్తుందని సూచిస్తున్నారు. బాల్యం, యుక్తవయస్సులో ఫాస్ట్ ఫుడ్ వినియోగం వల్ల వయోజన ఆస్తమా నియంత్రణ ప్రతికూలంగా ప్రభావితమవుతుందని National Library of medicine పేర్కొంది.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు (Getty image)

ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్ వంటివి సాధారణంగా సెమీ బాయిల్డ్ ఆయిల్‌లో వేయిస్తారు. వీటిలో సోడియం మరియు MSG (Monosodium Glutamate) వంటి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడిని పెరుగుతుందని, ఆస్తమాతో బాధపడేవారు వీటిని పూర్తిగా నివారించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ధూమపానం, మద్యం సేవించడం మానుకోండి : 'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. ఆల్కహాల్ అనేది శరీరాన్ని బలహీనపరచడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, పొగతాగడం వల్ల శ్వాస నాళాలు అనేవి హానికర పదార్థాల ప్రభావానికి లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఈ రెండింటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆస్తమా ప్రాథమిక నివారణ, వ్యాధి నిర్వహణ రెండింటికీ పొగా తాగడం తగ్గించడం చాలా ముఖ్యమని World Health Organizationపేర్కొంది.

మద్యం సేవించడం మానుకోవడం
మద్యం సేవించడం మానుకోవడం (Getty image)

కొంతమంది చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి తియ్యగా ఉంటాయి, కానీ అవి శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు వస్తాయని, ఆస్తమా రోగులు దీనిని తీసుకోవడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు.

ఆస్తమాతో బాధపడేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చల్లని, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు , కెఫిన్ కలిగిన పానీయాలు, ఆల్కహాల్, ధూమపానం వినియోగాన్ని తగ్గించాలని పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ ఒక కప్పు "బ్లాక్ కాఫీ" - బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

"గుండెపోటు" ముందుగానే ఇలా హెచ్చరిస్తుందట - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!