ETV Bharat / entertainment

OTTలో ఆసక్తి రేపుతున్న బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 2:35 PM IST

OTT : ఆసక్తి రేపుతున్న బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
OTT : ఆసక్తి రేపుతున్న బ్లాక్ బస్టర్​​ సిరీస్​ సీక్వెల్స్​​ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Upcoming Webseries Sequel : ఓటీటీలో సినిమాల కన్నా వెబ్‌ సిరీస్‌లకూ క్రేజ్ ఉంటుంది. భాషా భేదం లేకుండా వాటిని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే సినిమాలకే కాదు ఈ సిరీస్​లకు కూడా సీక్వెల్స్‌ వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ రాబోతున్న ఆ సీక్వెల్​ సిరీస్‌లేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి తెలుసుకుందాం.

Upcoming Webseries Sequel : ఓటీటీలో సినిమాల కన్నా వెబ్‌ సిరీస్‌లకూ మస్త్ క్రేజ్ ఉంటుంది. భాషా భేదం లేకుండా వాటిని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే వాటికి విశేష ఆదరణ ఎక్కువ దక్కుతుంటుంది. దీంతో సినిమాలకే కాదు ఈ సిరీస్​లకు కూడా సీక్వెల్స్‌ వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ రాబోతున్న ఆ సిరీస్‌లేంటి? ఇప్పుడు ఎన్నో సీజన్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాయో చూద్దాం.

The Family Man Amazon Prime Video : ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న సిరీస్‌ల్లో ది ఫ్యామిలీ మ్యాన్‌ ఒకటి. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విభాగంలో పని చేసేఓ వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లతో రూపొందిందీ సిరీస్‌. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకులు.సీజన్‌ 2లో సమంత నటించింది. ఇప్పుడు సీజన్ 3 త్వరలోనే రానుంది. చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆ మధ్య మనోజ్ చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mirzapur 3 Amazon Prime Video : వెబ్​సిరీసుల్లో మీర్జాపూర్‌ సిరీస్‌ ఓ సంచలనం. అలీ ఫజల్‌, విక్రాంత్‌ మస్సే, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్‌ థిల్లర్‌కు కరణ్‌ అన్షుమాన్‌ దర్శకత్వం వహించారు. 2018 నవంబరు 12న సీజన్‌ 1, 2020 అక్టోబరు 23న సీజన్‌ 2 విడుదలై విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్​గా సీజన్‌ 3 షూటింగ్ కంప్లీట్ అయింది. పార్ట్‌ 3 కూడా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనే రానుంది.

Maharani : పొలిటికల్ బ్యాక్ డ్రాప్​తో రూపొందిన మహారాణి సిరీస్​లో హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రధారి. పెద్దగా చదువుకోని ఓ మహిళ ప్రభుత్వంలోని పెద్దలతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వ్యవస్థతో ఆమె ఎలా పోరాడింది అనేదే కథ. కథాంశం. సీజన్‌ 1కుకరణ్‌ శర్మ, సీజన్‌ 2కు రవీంద్ర గౌతమ్‌ దర్శకత్వం వహించారు. సౌరభ్‌ భావే డైరెక్షన్‌లో సీజన్ 3 రాబోతుంది. మార్చి 7 నుంచి సోనీలివ్​లో స్ట్రీమింగ్‌ కానుంది.

Panchayat Amazon Prime Video : కామెడీ డ్రామా సిరీస్‌ పంచాయత్​తో అభిషేక్‌ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకుడు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విశేష ఆదరణను దక్కించుకున్నాయి. సీజన్‌ 3 మార్చిలో అమెజాన్ ప్రైమ్​ వీడియోలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Breathe Into the Shadows Amazon Prime Video : కిడ్నాప్‌నకు గురైన కుమార్తెను కాపాడుకోవడంలో డాక్టర్‌ అవినాష్‌ సభర్వాల్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆ కిడ్నాపర్‌ డిమాండ్‌ ఏంటి? తదితర అంశాలతో రూపొందిన సిరీస్​ బ్రీత్‌: ఇన్‌టూ ది షాడోస్‌ సిరీస్‌. డాక్టర్‌ అవినాష్‌గా అభిషేక్‌ బచ్చన్‌, నటి నిత్యా మేనన్‌ కీలకపాత్ర పోషించారు. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు మయాంక్‌శర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్​ తొలి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్‌ 3తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు అమెజాన్​లో రానుంది.

  • వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన దిల్లీ క్రైమ్‌(నెట్​ఫ్లిక్స్​) మూడో సీజన్​ ఈ ఏడాది విడుదల కావొచ్చు.యానిమల్ విలన్​
  • బాబీ దేవోల్‌ నటించిన ఆశ్రమ్​ సిరీస్​ మూడు సిరీస్​లు సక్సెస్​ఫుల్​గా ఆడింది. ఇప్పుడు నాలుగో సీజన్​ను ఈ ఏడాది చివరిలో విడుదల చేసే అవకాశముంది. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.
  • రానా నాయుడు సీజన్ 2 (నెట్‌ఫ్లిక్స్‌) : ఈ ఏడాదిలో విడుదల కావొచ్చు
  • కాలాపానీ సీజన్ 2 (నెట్‌ఫ్లిక్స్‌): త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది
  • దూత సీజన్ 2 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో) : ఈ సంవత్సంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి
  • ఫర్జీ సీజన్ 2 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో): ఈ ఏడాది చివరిలో లేదా 2025లో.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

పొట్టి పోలీస్ ఆఫీసర్​ అని నాగబాబు ఏ హీరోను అన్నారంటే? - కాంట్రవర్సీపై వరుణ్ క్లారిటీ

OTT : రూ.3 కోట్ల బడ్జెట్​తో​ రూ.50కోట్లకు పైగా వసూళ్లు - ప్రేక్షకుల మదిని దోచిన చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.