ETV Bharat / entertainment

టాలీవుడ్‌లో పీరియాడిక్‌ జోరు - Tollywood Periodic films

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 9:30 AM IST

Tollywood Periodic films : టాలీవుడ్‌లో పీరియాడిక్‌ కథల జోరు మునుపటితో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యింది. ఇంతకీ రానున్న ఈ సినిమాలు ఏంటో చూద్దాం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Tollywood Periodic films : కొత్తదనం పంచ క్రమంలో కాలాన్ని వెనక్కి తిప్పుతున్నారు మన హీరోలు. అలానే టైమ్‌ మిషన్‌ ఎక్కించి మరీ గత కాలానికి తీసుకెళ్లి వినోదాల విందు వడ్డించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వారెవరంటే?

  • బాహుబలి, ఆదిపురుష్‌ సినిమాలతో చరిత్ర పుటలు తిరగేసిన ప్రభాస్​ ఇప్పుడు కల్కి 2898ఎ.డి కోసం టైమ్‌ మిషన్‌ ఎక్కారు. దీని తర్వాత హను రాఘవపూడితో చేయబోయే చిత్రం కోసం మరోసారి గతంలోకి ప్రయాణించనున్నారట. ఫిక్షనల్‌ పీరియాడిక్‌ లవ్‌-యాక్షన్‌ డ్రామాగా ఇది రాబోతుంది.
  • విజయ్ దేవరకొండ - రాహుల్‌ సంకృత్యాన్‌ 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ సంఘటనలతో సినిమా చేయబోతున్నారు.
  • ఆర్‌ఆర్‌ఆర్‌ రామ్‌చరణ్‌ బుచ్చిబాబు సానతో చేయబోయే సినిమాను పీరియాడిక్‌ టచ్‌తో ఉన్న స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రా, రస్టిక్‌గా సినిమా ఉండనున్నట్లు తెలిసింది.
  • దసరా కాంబో నాని - శ్రీకాంత్‌ ఓదెల ఈ సారి విభిన్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ కథాంశంతోనే రానున్నారట.
  • మెగా హీరో వరుణ్‌తేజ్‌ కూడా మట్కాను పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగానే చేస్తున్నారు. 1950 - 1980 మధ్య సాగే ఈ కథకు కరుణ కుమార్‌ దర్శకుడు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • విరూపాక్ష, బ్రో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన మరో మెగా హీరో సాయితేజ్​ రాకేశ్‌ అనే కొత్త దర్శకుడితో కలిసి 1940 బ్యాక్​డ్రాప్​తో ఓ సినిమా చేయనున్నారు.
  • గతేడాది ఏజెంట్‌తో భారీ డిజాస్టర్ అందుకున్న అఖిల్ అక్కినేని కొత్త దర్శకుడు అనిల్‌తో ఆసక్తికరమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది.
  • ఈ నెలలోనే విశ్వక్​ సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, సుధీర్‌బాబు హరోం హర, రాకేశ్‌ వర్రె జితేందర్‌ రెడ్డి కూడా పిరీయాడిక్ డ్రామాతో రాబోతున్నారు.
  • బాలయ్య ఎన్​బీకే 109 కూడా 80ల నేపథ్యంతో సాగే యాక్షన్‌ కథా.
  • నిఖిల్‌ స్వయంభూ కూడా చారిత్రక కథాంశంతోనే రానుంది. నిఖిల్​ నటిస్తున్న మరో చిత్రం ది ఇండియా హౌస్‌ కూడా స్వాతంత్య్రానికి పూర్వం సాగే కథతోనే రానుంది.
  • శర్వానంద్‌ - అభిలాష్‌ రెడ్డి స్పోర్ట్స్‌ డ్రామాకు పీరియాడిక్‌ టచ్‌ ఉందట.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.