ETV Bharat / entertainment

ఓటీటీలో 'ప్రేమలు' మేనియా - ఈ సినిమాకు ఎందుకంత క్రేజ్? - Premalu Movie OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 1:49 PM IST

Premalu Movie OTT : మలయాళంలో సూపర్ హిట్ టాక్ అందుకుని తెలుగులోనూ దూసుకెళ్లిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. సింపుల్​గా తెరకెక్కిన ఈ మూవీ అటు బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఇటు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. మరి ఈ సినిమాలో అంత స్పెషాలిటీ ఏముందంటే ?

Premalu Movie OTT
Premalu Movie OTT

Premalu Movie OTT : 2024 ఏడాది మొదలై ఇప్పటి మూడు నెలలు కావొస్తోంది. ఈ సారి ఎన్నో కొత్త సినిమాలు ఎప్పటిలాగే బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. రీజనల్ నుంచి పాన్ ఇండియా వరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే మలయాళంలో విడుదలైన పలు సినిమాలు తెలుగులో సూపర్​హిట్ టాక్ అందుకున్నాయి. అందులో 'ప్రేమలు' ఒకటి. సుమారు 9 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుని దూసుకెళ్తోంది. యూత్​కు సంబంధించిన స్టోరీ దీంతో పాటు కొత్త ఎలిమెంట్స్ ఉండటం వల్ల ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

స‌చిన్ (హీరో) తన లైఫ్​ను బాగా ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం ఉన్న కుర్రాడు. అయితే అతడు అంజ‌లి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాలేజ్​ ఆఖరి రోజు త‌న లవ్​ను ఆమెకు తెలియజేస్తాడు. అయితే ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నట్లు చెప్పి సచిన్​కు షాకిస్తుంది. ఆ బాధలో ఉన్నప్పుడే అత‌డి యూకే వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. ఇలా వరుస దెబ్బలు తగలిన సమయంలో ఇంట్లో వాళ్లకు గేట్ కోచింగ్ పేరు చెప్పి అమూల్‌ అనే స్నేహితుడితో హైద‌రబాద్​లో వాలిపోతాడు.

ఇక్కడ తన లైఫ్​ను మళ్లీ జాలీగా గడపడం మొదలెడుతాడు. అప్పుడే సచిన్​కు ఓ పెళ్లిలో రీనూ రాయ్​తో (మ‌మితా బైజు) ప‌రిచ‌యం అవుతుంది. ఇక తనతో లవ్​లో పడిపోతాడు. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆమె తనతో చనువుగా ఉండటాన్ని చూసి ఒక రోజు ఆమెకు ఐ లవ్​ యూ చెప్తాడు. కానీ రీనూ అతడి లవ్ ప్రపోజల్​ను రిజెక్ట్ చేస్తుంది. నాకు నీ మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ రాలేదంటూ చెప్తుంది. దీంతో సచిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. హైదరబాద్ కూడా వదిలి వెళ్లిపోతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందన్నదే మిగతా స్టోరీ ? అయితే మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం రేపుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడిందంటే ?

టాక్ మొత్తం ఆ పాత్ర గురించే :
యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీస్​లో చాలా వరకు ఇదే స్టోరీ ఉంటుంది. ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్​ అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ తొలుత వాళ్ల లవ్​ ట్రాక్ నడవదు. ఆ తర్వాత అదే స్టోరీలో ఎన్నో ట్విస్ట్​లు వస్తుంటాయి. ప్రేమ‌లు కూడా అలాంటి స్టోరీనే. కానీ ఇందులో హీరో హీరోయిన్ల నటన సినిమాకే ప్లస్ పాయింట్​గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ మమితా బైజు ఈ చిత్రానికే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో ఆమె ఇట్టే ఒదిగిపోయింది. తన యాక్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్​కు యూత్ ఫిదా అయిపోయారు. ఎక్కడ చూసిన ఈమె గురించే టాక్ నడుస్తోంది.

ఆ రెండు అస్సలు లేవు :
ఇదిలా ఉండగా, విల‌న్స్‌తో ఫైట్స్​ లాంటివి ఇందులో లేవు. అంతగా ట్విస్ట్‌లు కూడా మనకు అనిపించవు. అంతే కాకుండా హద్దు మీరిన రొమాంటిక్ సీన్స్ అస్సలు లేవు. అలా ఇవేం లేకుండానే ఓ సింపుల్ స్టోరీని తెరపై ఓ రేంజ్​లో చూపించారు డైరెక్టర్. హీరో హీరోయిన్ల‌తో పాటు ఇందులో కనిపించిన ప్రతి ఒక్క పాత్రది నేచురల్ యాక్టింగ్​గానే ఉంటుంది. ఇప్పటి కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పలు మీమ్స్‌, డైలాగ్స్​ను సినిమాలో చక్కగా చూపించారు. దీంతో రొటీన్​ స్టోరీనే అయిన 'ప్రేమలు' ఇంకాస్త కొత్తగా అనిపించింది.

టాప్​ ట్రెండింగ్​లో మమితా బైజు - కుర్రాళ్ల మనసు దోచేస్తూ! - Premalu OTT

ప్రేమలు బ్యూటీ కూడా బన్నీకి వీర ఫ్యాన్!- నేషనల్ అవార్డ్ విన్నింగ్​ రోజు ఏకంగా ఇంటికే వెళ్లిందట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.