ETV Bharat / entertainment

రూ.20 కోట్లతో రూ.200 కోట్ల కలెక్షన్స్​ - బ్లాక్ బస్టర్​ మంజుమ్మ‌ల్ బాయ్స్‌ తెలుగు రివ్యూ - Manjummel Boys Telugu review

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 9:15 AM IST

Manjummel Boys Telugu Review : రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లను అందుకుని సరికొత్త రికార్డులను సృష్టించిన మలయాళ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజైంది. ఎలా ఉందంటే?

రూ.20 కోట్లతో రూ.200 కోట్ల కలెక్షన్స్​ - తెలుగు మంజుమ్మ‌ల్ బాయ్స్‌ రివ్యూ ఇదే
రూ.20 కోట్లతో రూ.200 కోట్ల కలెక్షన్స్​ - తెలుగు మంజుమ్మ‌ల్ బాయ్స్‌ రివ్యూ ఇదే

Manjummel Boys Telugu Review :

చిత్రం: మంజుమ్మ‌ల్ బాయ్స్‌;

న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు;

సంగీతం: సుశిన్ శ్యామ్‌;

ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్;

ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం;

నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌;

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇతర భాషలతో పోలిస్తే ఈ చిత్రాలకు ఉండే ఆదరణ ఎక్కువ ఉంటుంది. రీసెంట్​గా మాలీవుడ్ నుంచి భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి సినిమాలు వచ్చి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్లను అందుకున్నాయి. అయితే వీటిలో భ్రమయుగం, ప్రేమలు ఇక్కడ రిలీజ్ అవ్వగా మంజుమ్మల్ బాయ్స్​ తాజాగా రిలీజైంది. మలయాళంలో ఈ చిత్రం రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లను అందుకుని సరికొత్త రికార్డులను నెల‌కొల్పింది. దీంతో ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్​ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా తీసుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

క‌థేంటంటే ? - కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన సుభాష్ (శ్రీనాథ్ భాషి), కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌) పాటు వీరి స్నేహితులు సొంత ఊళ్లోనే చిన్నాచిత‌కా ఉద్యోగాలు చేస్తూ జీవ‌నం సాగిస్తుంటారు. అయితే ఈ గ్యాంగ్‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ కూడా ఉంటుంది. వీరందరూ క‌లిసి ఓ సారి కొడైకెనాల్ పర్యటనకు వెళ్తారు. అక్కడ పోలీసుల కళ్లు గప్పి గుణ కేవ్స్​లోని ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్​ను సందర్శిస్తారు. వాస్తవానికి దాదాపు 150 అడుగుల‌కు పైగా లోతున్న ఆ లోయ‌లో 13 మందికి పైగా ప‌డ‌గా ఒక్క‌రూ బతకలేదు. అలాంటి ప్రమాదకరమైన లోయల దగ్గర సరదాగా గడుపుతున్న ఆ గ్యాంగ్​లోని సుభాష్ అందులోకి జారిప‌డ‌తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడటానికి ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేశారు? పోలీసులు కూడా కాపాడటానికి భయపడిన సందర్భంలో సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? చివరికి వారు ప్రాణాలతో తిరిగి వచ్చారా లేదా? అనేది భావోద్వేగాలతో అద్భుతంగా తెరకెక్కించారు.

ఎలా సాగిందంటే ? ఇది య‌థార్థ సంఘటన. 2006లో నిజంగానే ఇది జరిగింది. ద‌ర్శ‌కుడు చిదంబ‌రం నేచురల్​గా తెరకెక్కించారు. క‌థ‌ ఉత్కంఠ‌గా సాగింది. మొదటగా నెమ్మదిగా మొదలైన తర్వాత బలంగా సాగుతుంది. ఇంటర్వెల్ వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాదు. పెద్ద‌గా డ్రామా, మలుపులు కూడా ఉండవు. కానీ మంజుమ్మ‌ల్ గ్యాంగ్ అల్ల‌రి బాగా ఆకట్టుకుంటుంది. గుణ కేవ్స్ చూడాల‌ని వెళ్లినప్పుడు కథ మ‌లుపు తిరుగుతుంది. సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో ప‌డిన త‌ర్వాతే క‌థ మస్త్​ ఉత్కంఠ‌గా వెళ్తుంది. మారిపోతుంది. సెకండాఫ్ అంతా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామాతోనే కథ ముందుకు వెళ్తుంది.

సుభాష్ లోయ‌లో ప‌డిపోయాక మిగాత ఫ్రెండ్స్​ పడిన ఆవేదను బాగా ఎమోషనల్​గా చూపించారు. పోలీసులు స్పందించే తీరును కూడా ఎంతో స‌హ‌జంగా చూపించారు. పోలీసుల‌, స్థానిక ప్ర‌జ‌లు సాయం చేసేందుకు ముందుకు రాకపోయినా తమ స్నేహితుడిని కాపాడేందుకు వారు చేసే తపన, ఆరాటం, సాహసం ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. ఎండింగ్ ఎమోషనల్​ సీన్ అద్భుతం. ఫైనల్​గా వచ్చే ఓ చిన్న ట్విస్ట్ కూడా ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. ఫైనల్​గా ఎండ్​ కార్డ్​ ప్రేక్షకుల మ‌న‌సుల్ని బ‌రువెక్కిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవరెలా చేశారంటే ? షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన వారంతా అద్భుతంగా నటించారు. ద‌ర్శ‌కుడు తెరకెక్కించిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహ‌కుడు త‌న కెమెరాతో అద్భుతం చేశాడు. క‌మ్మ‌ని నీ ప్రేమ లేఖ‌లే పాట‌ హైలైట్. నేప‌థ్య సంగీతం సూపర్. టెక్నిక‌ల్‌ వ్యాల్యూస్ బాగున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే మంజుమ్మల్ బాయ్స్​ క‌ట్టిప‌డేసే ఓ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌.

టాలీవుడ్ స్టార్​ హీరోల బిజీ షెడ్యూల్​ - వీళ్ల కొత్త సినిమాల లైనప్ ఇదే! - Tollywood Heroes

వీకెండ్ స్పెషల్ 25 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.