ETV Bharat / entertainment

'క' సినిమాకు అరుదైన గౌరవం- 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌' నామినేట్!

కిరణ్ అబ్బవరం సినిమాకు అరుదైన గౌరవం

KA Movie
KA Movie (Source : Film Poster, ETV Win)
author img

By ETV Bharat Telugu Team

Published : April 25, 2025 at 5:28 PM IST

1 Min Read
Choose ETV Bharat

KA Movie DadaSaheb Phalke : యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'క'. 2024 దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా భారీ విజయం అందకుంది. చిన్న బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే కిరణ్ కెరీర్​లో ఇది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఓ సంస్థ నిర్వహించే ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌'కు 'క' సినిమా నామినేట్‌ అయ్యింది. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ మూవీ నామినేట్‌ అయినట్లు టీమ్‌ తాజాగా ప్రకటించింది. ఈ నెల ఆఖరులో దిల్లీ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లోనే విజేతలకు పురస్కారాలు అందించనున్నారు.

ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ బ్లాక్​బస్టర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ 'ఈటీవీ విన్​'లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ ఫీలింగ్​కు భిన్నంగా ఈ సినిమాను ఈటీవీ విన్ ప్రేక్షకులకు ఓటీటీలో కొత్తగా ప్రజెంట్ చేస్తోది. డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌లో 'క' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

యంగ్ డైరెక్టర్లు డైరెక్టర్లు సుజీత్‌ - సందీప్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని కొత్త కాన్సెప్ట్​తో తెరకెక్కించారు. మనిషి పుట్టుక, కర్మ ఫలం, రుణానుబంధం - ఈ మూడు అంశాల్ని ముడిపెట్టిన దర్శకుడు, చివరికి చెప్పిన సందేశం, కథను ముగించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్​గా క 2ను కూడా తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. తొలి పార్ట్‌ కంటే రెండో పార్ట్‌ మరింత ఉత్కంఠగా సాగేలా చూస్తామని టీమ్‌ చెప్పింది.

కాగా, ఈ సినిమా విషయానికొస్తే యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్​గా నటించింది. శ్రీ చక్రాస్ ఎంటర్​టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై కృష్ణారెడ్డి నిర్మించారు. దీపావలి సందర్భంగా 2024 అక్టోబర్ 31న రిలీజన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

రెమ్యూనరేషన్ పెంచాలి కదా మరి!: కిరణ్ అబ్బవరం

'ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ సపోర్ట్ చెయ్యరు!'