అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్​కు రంగం సిద్ధం- షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 10:38 PM IST

AHIL AKKINENI

Akhil Akkineni Upcoming Movie: అక్కినేని అఖిల్ తదుపరి సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్.

Akhil Akkineni Upcoming Movie: టాలీవుడ్ స్టార్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' తర్వాత మరో సినిమా అనౌన్స్​ చేయలేదు. దీంతో అఖిల్ తదుపరి సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ప్రాజెక్ట్​కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అఖిల్ తదుపరి మూవీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) బ్యానర్​పై రూపొందనుందని ఇన్​సైట్ టాక్ వినిపిస్తోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే స్ట్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మార్చి తొలి వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, రెండో వారంలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రూ.80కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందించనుందట. కేజీఎఫ్ కో ప్రొడ్యూసర్, హొంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. కానీ, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్​ అనిల్ కుమార్ తెరకెక్కించనున్నట్లు తెలిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ 'సాహో' కు అనిల్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశారు. ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం కానున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్​కు 'ధీర' అనే పేరు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూజా కార్యక్రమంలో యూవీ క్రియేషన్స్ పూర్తి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. అయితే ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఇష్టపడే అఖిల్, ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఆసక్తిగా మారింది.

ఇక అఖిల్ చివరగా 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్​ కోసం అఖిల్ దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. 2023 ఏప్రిల్‌ 28న థియేటర్‌లో గ్రాండ్​గా రిలీజైన సినిమా మిక్స్​డ్ టాక్ అందుకుంది. కానీ, సినిమా కోసం అఖిల్ చేసిన ప్రయత్నాలకు మంచి మార్కులే పడ్డాయి. మూవీలో యాక్షన్ సీన్స్​ ఆడియెన్స్​ను మెప్పించాయి. ఇక పలు కారణాల వల్ల ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు.

అఖిల్ హైపర్ యాక్టివ్ - కానీ చైతూనే అలాంటోడు : వైరల్​గా అమల కామెంట్స్!

Agent Movie OTT Release : అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.