స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 790 పాయింట్లు డౌన్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 3:39 PM IST

Updated : Feb 28, 2024, 4:14 PM IST

Share Market Today February 28th 2024

Stock Market Close Today February 28th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. మిడ్​, స్మాల్​ క్యాప్ షేర్లు అయితే భారీగా పతనం అయ్యాయి.

Stock Market Close Today February 28th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 790 పాయింట్లు నష్టపోయి 72,304 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన స్టాక్స్​ : ​హిందూస్థాన్ యూనిలివర్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్
  • నష్టపోయిన షేర్స్​ : పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, విప్రో, టాటా స్టీల్​, ఏసియన్ పెయింట్స్​, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ

Paytm Shares Fall : బుధవారం పేటీఎం (వన్​97 కమ్యునికేషన్స్​ లిమిటెడ్​) షేర్స్​ 5 శాతం మేర నష్టపోయాయి. ఆర్​బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​పై ఆంక్షలు విధించిన తరువాత ఈ సంస్థ తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.

Asian Stock Markets Today February 28th 2024 :
బుధవారం ఆసియా మార్కెట్లు అయిన టోక్యో, షాంఘై, హాంకాంగ్​ నష్టాలతో ముగిశాయి. ఒక్క సియోల్ మాత్రమే స్వల్ప లాభాలతో స్థిరపడింది. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇవన్నీ ఇండియన్ స్టాక్​ మార్కెట్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
FII Investments In India : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,509 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.

ముడిచమురు ధరలు
Crude Oil Prices February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.90 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.90 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.

ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్​ - డీఏ పెంపునకు ముహూర్తం ఫిక్స్!

భారతీయ టూరిస్టులకు దుబాయి స్పెషల్​ ఆఫర్ ​- ఒక్క వీసాతో 5 ఏళ్లు ఎంజాయ్​ చేయొచ్చు!

Last Updated :Feb 28, 2024, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.