ETV Bharat / business

ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్​ - డీఏ పెంపునకు ముహూర్తం ఫిక్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 3:18 PM IST

DA Hike 2024 : ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో డియర్​నెస్​ అలవెన్స్​ (డీఏ) పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Dearness Allowance Hike 2024
DA Hike 2024

DA Hike 2024 : కేంద్ర ప్రభుత్వం ఈ మార్చి నెలలో సెంట్రల్ గవర్నమెంట్​ ఉద్యోగులకు డియర్​నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచవచ్చని సమాచారం. ఇదే జరిగితే డీఏ, డియర్​నెస్ రిలీఫ్​ (డీఆర్​) రెండూ కలిపి బేసిక్ సాలరీలో 50 శాతానికి మించిపోతాయి.

సీపీఐ డేటా ఆధారంగా
పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించిన వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ డేటా) ఆధారంగా ఈ డియర్​నెస్​ అలవెన్స్​ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సీపీఐ 12 నెలల సగటు డేటా 392.83గా ఉంది. దీనిని బట్టి లెక్కవేస్తే, డియర్​నెస్ అలవెన్స్ అనేది ప్రాథమిక వేతనంలో 50.26 శాతంగా ఉంటుంది.

డీఏ & డీఆర్​
కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే లేబర్ బ్యూరో 'సీపీఐ' డేటాను నెలవారీగా ప్రచురిస్తూ ఉంటుంది. దీని ఆధారంగానే డీఏ & డీఆర్​లను కేంద్రం ప్రకటిస్తూ ఉంటుంది. డియర్​నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులకు చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు భత్యం. డియర్​నెస్ రిలీఫ్ అనేది పెన్షనర్లకు అందించే జీవన వ్యయ సర్దుబాటు భత్యం.

సాధారణంగా జనవరి, జులై నెలల్లో ఈ డీఏ సెమీ-ఆన్యువల్​ రివ్యూ చేస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంత మేరకు డీఏ, డీఆర్​ పెంచాలో నిర్ణయిస్తారు.

చివరి సారిగా 2023 అక్టోబర్​లో డీఏను 4 శాతం పెంచారు. దీనితో ప్రాథమిక వేతనంలో 46 శాతానికి డీఏ పెరిగింది. ఈ 2024 మార్చిలో కూడా డీఏను మరో 4 శాతం పెంచవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు 2024 జనవరి 1 నుంచే డీఏ ప్రయోజనాలు లభిస్తాయి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చాలా లాభదాయకంగా ఉంటుంది.

డీఏ & డీఆర్​ ఫార్ములా
7వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) డీఏ గణన కోసం క్రింది ప్రత్యేక ఫార్ములాను ఉపయోగిస్తుంది.

డీఏ% = [{12 నెలల ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ (బేస్ ఇయర్ 2001=100) గత 12 నెలలకు 261.42}/261.42x100]

భారతీయ టూరిస్టులకు దుబాయి స్పెషల్​ ఆఫర్ ​- ఒక్క వీసాతో 5 ఏళ్లు ఎంజాయ్​ చేయొచ్చు!

అన్నదాతలకు గుడ్​న్యూస్ - ఫిబ్రవరి 28న 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ - ఎలా చెక్​ చేసుకోవాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.