ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​లు వాడుతున్నారా? ఈ అపోహలు & వాస్తవాలు గురించి తెలుసుకోండి! - Credit Card Myths

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 3:40 PM IST

Credit Card Myths : క్రెడిట్ కార్డులపై యూజర్లకు చాలా అపోహలు ఉంటాయి. క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారా లభించే రివార్డు పాయింట్లపైనా సవాలక్ష డౌట్స్ ఉన్నాయి. ఈ సందేహాలను క్లియర్ చేసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Shocking Myths About Credit Cards
Credit Card Myths Debunked

Credit Card Myths : ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా పెద్దసంఖ్యలో వాటిని జారీ చేస్తూ భారీగానే 'క్రెడిట్' బిజినెస్ చేసుకుంటున్నాయి. అయినా క్రెడిట్ కార్డులపై నేటికీ యూజర్లకు చాలా అపోహలు ఉన్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారా అందే రివార్డు పాయింట్ల గురించి కూడా సవాలక్ష డౌట్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.

అపోహ: క్రెడిట్ కార్డు తీసుకుంటే క్రెడిట్ స్కోర్‌ ప్రభావితం అవుతుందా ?

వాస్తవం : క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల క్రెడిట్ స్కోరుపై నెగెటివ్ ఎఫెక్ట్​ ఉండదు. అయితే క్రెడిట్ కార్డు అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసే క్రమంలో మీ సిబిల్ స్కోరును చెక్ చేస్తారు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా కొన్ని పాయింట్లు తగ్గుతుంది. క్రెడిట్ కార్డుకు అప్లై చేయడం ప్రమాదకరమైన నిర్ణయమేం కాదు. అయితే ఒకేసారి ఒకటికి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులకు అప్లై చేయడం సరికాదు.

అపోహ : క్రెడిట్ కార్డును క్యాన్సల్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్‌ బెటర్ అవుతుందా ?

వాస్తవం : క్రెడిట్ కార్డులను రద్దు చేయించుకున్నంత మాత్రాన మీ క్రెడిట్ స్కోరు పెరగదు. వాటిని తగిన క్రమశిక్షణతో వాడితే మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంటుంది. యుటిలిటీ బిల్లులు కట్టడానికి ప్రతినెలా క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. రీపేమెంట్ కరెక్టు టైంలో చేస్తే చాలు, మీ సిబిల్ స్కోరు ఇంప్రూవ్ అవుతుంటుంది.

అపోహ : క్రెడిట్ కార్డు వినియోగంతో వచ్చే రివార్డు పాయింట్ల వల్ల ఎలాంటి తేడా ఉండదు!

వాస్తవం : క్రెడిట్ కార్డును వాడటం వల్ల వచ్చే రివార్డ్ పాయింట్లు, మైల్స్ నిజంగా మార్పును కలిగిస్తాయి. చిన్నచిన్న నీటి చుక్కలు కలిసి మహాసముద్రంగా మారుతుందని మీరు వినే ఉంటారు. అదేవిధంగా ఈ చిన్నచిన్న రివార్డు పాయింట్లు, మైల్స్ కలిసి మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మొదట్లో మీకు ఇవి తక్కువగా కనిపిస్తాయి. కొంతకాలం వాటిని అలాగే వదిలేస్తే, పెద్ద మొత్తంగా కన్వర్ట్ అవుతాయి. అనంతరం వాటితో మనం ఏదైనా వస్తువును కొనుక్కోవచ్చు. ఏదైనా యుటిలిటీ బిల్లు కట్టేయొచ్చు. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందొచ్చు.

అపోహ: కేవలం సైనప్ బోనస్‌ల కోసమే క్రెడిట్ కార్డ్‌ తీసుకుంటాను!

వాస్తవం : సైనప్ బోనస్‌లు అట్రాక్టివ్‌గా ఉంటాయి. కేవలం వాటి కోసమే క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావించడం సరికాదు. ఇలాంటి ఆఫర్లతో మనకు కలిగే ప్రయోజనం తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. కార్డును దీర్ఘకాలం పాటు వాడే క్రమంలో కలిగే ప్రయోజనాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇలా ఆఫర్లు కనిపించినప్పుడల్లా క్రెడిట్ కార్డులను తీసుకుంటూ ఉంటే మీ క్రెడిట్ స్కోరు డౌన్ అయిపోతుంది.

అపోహ: క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉండటమే నా సమస్యలన్నింటికీ పరిష్కారం!

వాస్తవం : క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉంటే తమకు సిబిల్ స్కోరు తగ్గే రిస్క్ ఉండదని చాలామంది భావిస్తుంటారు. తక్కువ క్రెడిట్ లిమిట్ ఉంటే ఆర్థిక సమస్యలు కూడా ఉండవని, క్రెడిట్ కార్డుపై ఆధారపడే మనస్తత్వం కూడా పోతుందని అనుకుంటారు. వాస్తవానికి ఇలాంటి నిర్ణయాల వల్ల క్రెడిట్ స్కోరు తగ్గదు. క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, దాన్ని వినియోగించే తీరు ఆధారంగానే మన క్రెడిట్ స్కోరు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.

అపోహ: రివార్డు పాయింట్లను ఎన్‌క్యాష్ చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది!

వాస్తవం : క్రెడిట్ కార్డు వినియోగం వల్ల వచ్చే రివార్డు పాయింట్లను వాడేసుకుంటే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇది నిజం కాదు. క్రెడిట్ కార్డు పేమెంట్స్ సరిగ్గా చేయకుంటే, ఈఎంఐ పేమెంట్లు మిస్సైతే, తక్కువ టైంలో ఎక్కువ క్రెడిట్ కార్డు అప్లికేషన్లు పెడితే సిబిల్ స్కోరు దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు వాడటం వల్ల బోనస్‌గా అందే రివార్డు పాయింట్లను వాడుకునే హక్కు కస్టమర్‌కు ఉంటుంది. ఈవిషయాన్ని సిబిల్ నెగెటివ్‌గా పరిగణించదు.

అపోహ: ఆ రివార్డు పాయింట్లు నా డబ్బుల్లో నుంచి ఇచ్చినవే!

వాస్తవం : రివార్డు పాయింట్లు అనేవి మీ నగదుతో సంబంధం లేనివి. మీరు బిల్లులను సకాలంలో కట్టినందుకు ఈ రివార్డు పాయింట్లు వస్తుంటాయి. ఎల్లవేళలా తగిన బ్యాలెన్సును మెయింటైన్ చేసినా మీకు రివార్డు పాయింట్స్ ఇష్యూ అవుతాయి. అంతే తప్ప మీ నగదు నుంచి కోత పెట్టి వీటిని ఇవ్వరు. మీ లావాదేవీలకు, క్రమశిక్షణకు ప్రోత్సాహకంగా రివార్డు పాయింట్స్ వస్తుంటాయి.

అపోహ: క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లతో ట్రావెల్ ఖర్చులను పొందవచ్చు!

వాస్తవం : కొన్ని క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారా ఎయిర్ మైల్స్ వస్తుంటాయి. వాటన్నింటిని జమ చేసి విమాన టికెట్‌ను కొనొచ్చు అనేది అపోహ. ఎయిర్ మైల్స్ ద్వారా జమయ్యే అమౌంట్ అనేది ఎయిర్ టికెట్ కొనుగోలుకు సరిపోదు. ఇంధన సర్​ఛార్జ్, మీ వసతి ఖర్చులు అనేవి ఈ రివార్డులలో భాగం కాదు. ఎయిర్ మైల్స్ వల్ల మీ ఎయిర్ టికెట్ రేటు కచ్చితంగా చౌకగా మారుతుంది. అంతేకానీ పూర్తిగా ఫ్రీగా లభించదు. పై అన్ని అంశాల ద్వారా క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లపై మీకున్న అపోహలు తొలగిపోతాయి. చూశారుగా! ఇకపై క్రెడిట్ కార్డ్​లపై మీకున్న అపోహలు వీడి, సరైన విధానంలో వాటిని ఉపయోగించుకోండి.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ - అడ్వాన్స్​ విత్​డ్రావెల్ లిమిట్​ 'డబుల్'! - EPF Advance Claim Limit

బెస్ట్​ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే? - Best Sports Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.