ETV Bharat / business

సీనియర్​ సిటిజన్స్​ కోసం 3 సూపర్​​ స్కీమ్స్​- ఇన్వెస్ట్​ చేస్తే డబ్బే డబ్బు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 5:12 PM IST

How Many Ways To Get Pension After Retirement : ఉద్యోగ విరమణ తర్వాత వస్తున్న పెన్షన్​ మీ అదనపు ఆర్థిక అవసరాలకు సరిపోవట్లేదా? అయితే ఇది మీ కోసమే. సీనియర్​ సిటిజన్స్​ కోసం కొన్ని మంచి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే, మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అధిక రాబడి కూడా వస్తుంది. మరి ఆ పథకాలు ఏమిటో తెలుసుకుందామా?

senior citizen investment schemes
How Many Ways To Get Pension After Retirement

How Many Ways To Get Pension After Retirement : పదవీ విరమణ తర్వాత దాదాపు అందరికీ పెన్షన్​ వస్తుంది. అయితే ఆ పెన్షన్​ డబ్బు మీ అదనపు ఆర్థిక అవసరాలకు సరిపోకవచ్చు. లేదా వైద్య చికిత్సలకు అదనపు సొమ్ము కావాల్సివస్తుంది. అందుకే చాలా మంది అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే మూడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం
60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు 'సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం' (ఎస్​సీఎస్​ఎస్​) అనేది ఒక మంచి పెట్టుబడి మార్గం అవుతుంది. ఈ స్కీంలో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఒకేసారి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

  • పెట్టుబడి కాలవ్యవధి - 5 సంవత్సరాలు
  • స్కీం ఎక్స్​టెన్షన్​ - 3 సంవత్సరాల వరకు పథకాన్ని పొడిగించుకోవచ్చు
  • వార్షిక వడ్డీ రేటు - 8.20 శాతం
  • కనిష్ఠ మదుపు - రూ.1000
  • గరిష్ఠ పెట్టుబడి - రూ.30 లక్షలు
  • వడ్డీ చెల్లింపు - ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌, జనవరి మొదటి తేదీలో పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో వడ్డీ జమవుతుంది.
  • రూ.30 లక్షల డిపాజిట్‌కు ఒక త్రైమాసికానికి రూ.61,600 వరకు వడ్డీ వస్తుంది.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం ప్రభుత్వం హామీ ఉండే పథకం కాబట్టి, పదవీ విరమణ చేసిన వారు ఎటువంటి రిస్క్​ లేకుండా ఇందులో మదుపు చేయవచ్చు. అవసరమైతే పెట్టుబడి మొత్తాన్ని మధ్యలో విత్​డ్రా చేసుకునేందుకు ఛాన్స్​ ఉంటుంది.

పోస్టాఫీస్​ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం (పీఓఎంఐఎస్​) అనేది సీనియర్ సిటిజన్లకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కనుక మీ డిపాజిట్ సొమ్ము​ సురక్షితంగా ఉంటుంది. ప్రతి నెలా ఆదాయం కోరుకునే సీనియర్‌ సిటిజన్లకు ఈ పెన్షన్​ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది.

  • పెట్టుబడి కాలవ్యవధి- 5 ఏళ్లు
  • గరిష్ఠ పెట్టుబడి- రూ.9 లక్షలు (వ్యక్తిగత ఖాతాలో)
  • గరిష్ఠ పెట్టుబడి- రూ.15 లక్షలు (ఉమ్మడి​ ఖాతాలో)
  • ప్రస్తుత వడ్డీ రేటు- 7.40 శాతం
  • రూ.9 లక్షల డిపాజిట్‌కు ప్రతి నెలా రూ.5,550 వడ్డీని పొందవచ్చు.
  • పెట్టుబడిని పొడిగింపు​- అదనంగా 5 సంవత్సరాల వరకు పథకాన్ని పొడిగించుకోవచ్చు.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీ కంటే, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. కనుక వయోవృద్ధులు సురక్షితమైన పెట్టుబడుల కోసం ఎఫ్​డీలను ఎంచుకోవచ్చు. బ్యాంకులు వడ్డీని ఖాతాదారులకు నెల, 3 నెలలు, 6 నెలలు, 12 నెలల కాలవ్యవధుల్లో చెల్లిస్తుంటాయి. అంతేకాదు సీనియర్​ సిటిజన్​లకు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 7% - 7.5% వరకు వడ్డీని ఇస్తున్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులకు ఇచ్చే దానికంటే 1% నుంచి 1.50% వరకు అదనపు వడ్డీని అందిస్తున్నాయి.

HDFC నుంచి 4 కొత్త బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులు - బెనిఫిట్స్​ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

భారతీయ టూరిస్టులకు దుబాయి స్పెషల్​ ఆఫర్ ​- ఒక్క వీసాతో 5 ఏళ్లు ఎంజాయ్​ చేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.