ETV Bharat / business

నూతన ఆర్థిక సంవత్సరాన్ని ఇలా సరికొత్తగా ప్రారంభిద్దామా? - financial goal setting for new year

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 4:43 PM IST

Financial Resolutions For 2024-25 : ఈనెల 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థికపరంగా అనేక విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపన్ను, బ్యాంకింగ్​ సంబంధిత లావాదేవీలు లాంటి ఎన్నో మార్పులు ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Financial Goal Planning For New Financial Year
Financial Goal Setting For 2024-25

Financial Resolutions For 2024-25 : ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సరికొత్త ఆర్థిక లక్ష్యాలు ఏర్పరుచుకుంటారు. మరి ఈ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలి? వీటిని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా ప్రారంభించండి
పొదుపు, పెట్టుబడులు అనేవి ఏదో ఒక రోజు ప్రారంభించక తప్పదు. మీకు ఆదాయం తక్కువగా ఉందని ఖర్చులు అయితే ఆగవు కదా? ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం సంపాదిస్తున్న దానిలో కొంచెం పెట్టుబడుల కోసం కేటాయించాలి. అది ఈ ఏప్రిల్​ 1 నుంచే ప్రారంభించడం మంచిది.

ఆర్ధిక స్థితి
మీ నికర విలువ ఎంతో మీకు తెలుసా? మీకున్న ఆస్తులు, బాధ్యతల మధ్య వ్యత్యాసమే ఈ నికర విలువ. ఆదాయంలో నుంచి ఎంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. మీరు ఏ స్థాయిలోనే జీవిస్తున్నారు? అనే అంశాలు మీ ఆర్థిక స్థితిని తెలియజేస్తాయి. పొదుపు, పెట్టుబడుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నికర విలువ అధికంగా ఉంటే ఆర్థికంగా మీరు బాగున్నట్లు లెక్క.

లక్ష్యాలను గుర్తించండి!
ఆర్థిక లక్ష్యాలు అనేవి అవసరాలు, కోరికల రూపంలో ఉంటాయి. వాటిని వాస్తవ రూపంలోకి మారేందుకు డబ్బు అవసరం ఉంటుంది. సొంత ఇల్లు, కారు కొనడం, పిల్లల చదువులు, వారి వివాహం, పదవీ విరమణ ఇవన్నీ కూడా సాధారణ ఆర్థిక లక్ష్యాల కిందకే వస్తాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరుచుకుని, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి.

అలస్యం చేయకూడదు
పెట్టుబడుల విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. తొందరగా పెట్టుబడులను ప్రారంభిస్తే, చక్రవడ్డీ ప్రభావంతో వేగంగా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. పీపీఎఫ్ లాంటి వాటిలో ఏప్రిల్ 1లోపు పెట్టుబడి పెట్టడం మంచిది. కనీసం రూ.1000తోనైనా పెట్టుబడులు ప్రారంభించాలి. వచ్చే 5 ఏళ్లపాటు భారత ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. గనుక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

ఒకే చోట పెట్టుబడి వద్దు!
డబ్బును ఎప్పుడూ ఒకే చోట పెట్టుబడి పెట్టడం సరికాదు. పెట్టుబడి పథకాలు ఏమున్నాయో ఓసారి తెలుసుకోవాలి. నష్టాన్ని భరించే శక్తిని అనుసరించి, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి.

ఆర్థిక భరోసా
మీ సంపాదనపైనే మీ కుటుంబం ఆధారపడుతుంటే తగిన ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్యం. జీవితంలో ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు, వారికి ఆర్థిక భరోసా కల్పించే జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. పిల్లల చదువులకు కూడా పాలసీలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

పన్ను ప్రణాళికలు
ఆర్థిక ఏడాది ప్రారంభం కాగానే పన్నుల ప్రణాళికలు వేసుకోవాలి. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి పన్ను ఆదా పెట్టుబడులతో పని ఉండదు.

చివరగా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే, ఇప్పటికే ఉన్న మీ ఆర్థిక లక్ష్యాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకోవడం ముఖ్యం. పెరిగిన మీ ఆదాయానికి తగ్గట్లుగా పెట్టుబడులు ఉన్నాయా? లేదా? ఏమైనా సర్దుబాట్లు అవసరం అవుతాయా? అనేది చూసుకోవాలి. అప్పుడే కొత్త ఆర్థిక సంవత్సరం(2024-25)లో మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది.

ఫైనాన్సియల్ డెడ్​లైన్స్​ - మార్చి 31లోగా ఇవి పూర్తి చేయాల్సిందే! - Financial Deadlines In March 2024

భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today March 29th 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.