ETV Bharat / business

పెళ్లైన జంటలకు అలర్ట్! మీ వద్ద ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదంటే త్వరపడండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 3:38 PM IST

Financial Documents For Couples : మీకు పెళ్లైందా? వివాహం తర్వాత దంపతులు తీసుకోవాల్సిన పత్రాలు మీ వద్ద ఉన్నాయా? వివాహ ధ్రువీకరణ పత్రమే కాకుండా అనేక డాక్యుమెంట్స్ తీసుకోవాలన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే చింతించాల్సిన అవసరం లేదు. దేశంలో దంపతుల వద్ద ఉండాల్సిన ముఖ్యమైన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏంటో ఈ కథనంలో చూసేద్దాం పదండి.

Financial Documents For Couples
Financial Documents For Couples

Financial Documents For Couples : ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరూ చెప్పలేం. అందుకని ఈ విషయంలో అజాగ్రత్త వహించకుండా ముందు నుంచే కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్స్​. ముఖ్యంగా పెళ్లైన దంపతులు వీటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లైన కొత్త కపుల్​తో పాటు ఇప్పటికే పెళ్లైన వారు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా కొన్ని విలువైన ఫైనాన్షియల్​ డాక్యుమెంట్స్​ను భద్రపరుచుకోవాలని అంటున్నారు. మరి తప్పనిసరిగా ఉండాల్సిన ఆ ఆర్థిక పత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

What Are The Most Important Documents To Have :
జాయింట్​ బ్యాంక్​ అకౌంట్​
సాధారణంగా కుటుంబ సభ్యులు పొదుపు కోసం లేదా ఏదైన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్య సాధన కోసం ఉమ్మడి లేదా జాయింట్​ బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. ఇతర రెగ్యులర్‌ ఖాతాల మాదిరే ఇక్కడా పొదుపు ఖాతాతో పాటు లోన్‌ అకౌంట్‌, మార్జిగేజ్‌ అకౌంట్‌ ఇలా కొన్ని రకాల ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా ప్రారంభించేందుకు భాగస్వాములు ఇద్దరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రకమైన అకౌంట్​ను నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో మీరు అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందుకని దంపతుల మధ్య ఈ సాధారణమైన జాయింట్​ బ్యాంక్​ ఖాతా ఉండడం ఉత్తమం. ఇందులో అనేక రకాల జాయింట్​ ఖాతాలు ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఇద్దరికీ సమానంగా ఉండే అకౌంట్​లను తెరిస్తే భవిష్యత్తులో ఎటువంటి పొరపచ్చాలు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా ఆలోచించడం మంచిది.

విల్​ అండ్​ టెస్టమెంట్​
విల్​ అండ్​ టెస్టమెంట్​- ఈ చట్టపరమైన పత్రాన్ని ప్రతి ఒక్క కపుల్​ కలిగి ఉండాలి. మీ మరణానంతరం మీకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వనరులు ఎవరికి చెందాలి, వాటిని వారికి ఎలా పంచాలి అనే వివరాలను తెలియజేస్తూ ఈ పత్రాన్ని తయారు చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీ పార్ట్​నర్​ కోరికలను మీరు గౌరవించినవారు అవుతారు. అలాగే మీకు కావాల్సిన వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసినట్లవుతుంది.

మ్యారేజ్​ సర్టిఫికేట్​
మ్యారేజ్​ సర్టిఫికేట్​ లేదా వివాహ ధ్రువీకరణ పత్రం ప్రతి జంటకు ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా భారత్​లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సర్టిఫికేట్​ మీ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తిస్తుంది. జాయింట్​ అకౌంట్​ ఓపెనింగ్​, బీమా పాలసీల కోసం దరఖాస్తు, ఉమ్మడి రుణాలు పొందడం వంటి వివిధ ఆర్థిక విషయాల్లో ఈ ధ్రువపత్రం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని కలిగి ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్​ చేసుకుంటూ ఉండడం ఉత్తమం.

ఇన్సూరెన్స్ పాలసీలు
నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్క జంటకు జీవిత బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇవి మీ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తీసుకునే ఈ పాలసీలు మీ మరణానంతరం మీ జీవితభాగస్వామికి ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. మీ ఆర్థిక, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఈ బీమా పాలసీలను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేసుకోవడం మంచిది.

ప్రాపర్టీ డాక్యుమెంట్స్​
మీరు జంటగా ఏదైనా ఆస్తిని కలిగి ఉంటే వాటికి సంబంధించిన అన్ని పత్రాలను క్రమ పద్ధతిలో భద్రపరచడం చాలా ముఖ్యం. ఇందులో కొనుగోలు ఒప్పందాలు, టైటిల్​ డీడ్‌లు, రుణ పత్రాలు, రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్‌లు సహా ఇతర ఆస్తి పత్రాలు ఉంటాయి. ఇవి మీ యాజమాన్య హక్కులను గుర్తించడమే కాకుండా ఆస్తి బదిలీలు, రుణాలు సహా ఇతర చట్టపరమైన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.

ఐటీఆర్​, ఆర్థిక నివేదికలు
మన దేశంలో ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్స్​ సహా ఇతర ఆర్థిక నివేదికలను మెయింటెయిన్​ చేయడం ప్రతి జంటకు అవసరం. ఇది మీరు సరైన సమయానికి ఎటువంటి తప్పులు లేకుండా ఐటీఆర్​లు ఫైల్​ చేసేందుకు దోహదపడతాయి. తద్వారా మీరు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అన్నింటినీ చట్టపరంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసేందుకు సహాయపడతాయి. మెరుగైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు, అత్యవసర సమయాల్లో రుణాలు పొందేందుకు ఉపయోగపడతాయి.
కొత్తగా పెళ్లి చేసుకున్న వారితో పాటు ఇప్పటికే పెళ్లైన దంపతులు భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పైన తెలిపిన డాక్యుమెంట్స్​ను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్​ షురూ - వారికి స్పెషల్​ డిస్కౌంట్ - అప్లై చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.