ETV Bharat / business

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 10:43 AM IST

Engine Warning Signs : కారు కొని ఏడాది కాకుండానే గ్యారేజ్‌కు దారెటు భయ్యా అంటోందా? అయితే.. ఈ పరిస్థితికి మీరూ కారణమే! అవును.. కారులో వచ్చే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్‌ పట్టించుకోకపోతే.. షెడ్డుకు వెళ్లడం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ సిగ్నల్స్‌ ఏంటో తెలుసుకోండి!

Engine Warning Signs
Engine Warning Signs

Engine Warning Signs : కారు కొనుగోలు చేసిన కొత్తలో చాలా బాగా చూసుకుంటారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత కనీసం టైమ్​కు సర్వీసింగ్‌ కూడా చేయించరు. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే.. కారు లైఫ్‌టైమ్‌ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారులో ఏవైనా రిపేర్‌లు వచ్చినప్పుడు మనకు ఇంజిన్‌ నుంచి.. డ్యాష్‌బోర్డ్‌ నుంచి కొన్ని సిగ్నల్స్‌ కనిపిస్తాయని.. వెంటనే అలర్ట్ కావాలని చెబుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి.. కారులో వచ్చే ఆ వార్నింగ్‌ సైన్స్‌ ఏంటో మీకు తెలుసా??

వార్నింగ్‌ సిగ్నల్స్‌ :
సాధారణంగా ప్రతి కారులో ఉండే డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌పై ఏదైనా సమస్యలు ఉంటే వార్నింగ్‌ సైన్స్‌ కనిపిస్తూనే ఉంటాయి. తప్పకుండా డ్రైవర్‌ వాటిని గుర్తించి.. సరిచేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కారు తొందరగా పాడైపోతుంది. ఇంకా ప్రత్యేకించి.. ఇంజిన్‌ విషయంలో వచ్చే వార్నింగ్‌ సైన్స్‌ను పట్టించుకోకుండా ఉంటే అది చెడిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

చెక్ ఇంజన్ లైట్ :
దాదాపు అన్ని కార్లలో ఇంజిన్‌ క్లస్టర్‌పై 'చెక్ ఇంజన్ లైట్' ఉంటుంది. ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉన్నా.. అలాగే ఏవైనా పార్ట్స్, సెన్సార్‌ వంటివి పనిచేయకపోయినా.. డాష్‌బోర్డ్‌లో అలర్ట్‌ చేస్తుంది. అప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హై మోడల్‌ కార్లు అత్యాధునిక డయాగ్నొస్టిక్ సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు అన్ని సిగ్నల్‌నూ డాష్‌బోర్డ్‌పై చూపిస్తుంటాయి.

సైలెన్సర్​లో తెల్లటి పొగ :
సాధారణంగా చలికాలంలో కారు సైలెన్సర్ నుంచి చిన్నపాటి తెల్లటి పొగ వస్తుంటుంది. అయితే.. ఈ పొగ బ్లాక్‌ కలర్, బ్లూ కలర్‌లో అలాగే మందపాటి తెల్లటి పొగగా వస్తున్నట్లయితే ఇంజిన్‌లో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దీనికి కారణం ఇంజిన్‌కు ఇంధన సరఫరా సరిగ్గా జరగకపోవడం కావచ్చని నిపుణులు అంటున్నారు.

ఆగుతూ వెళ్తుంటే :
కారును డ్రైవ్‌ చేస్తున్నప్పుడు అది స్మూత్‌గా వెళ్తోందా లేదా హార్డ్‌గా ముందుకు కదులుతోందా అనే విషయం మనకు అర్థం అవుతుంటుంది. అయితే.. కారు ఇంజిన్‌ ఎక్కువగా వైబ్రేట్‌ అవడం.. ఆగుతూ ఆగుతూ ముందుకు పోవటం, పికప్‌ తగ్గడం వంటివి కనిపిస్తే కారును వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. కారులో స్పార్క్ ప్లగ్ ఫౌల్స్, ఇగ్నిషన్ కాయిల్స్, ఎయిర్ ఫిల్టర్ వంటివి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంకా..

రోజురోజుకూ కారు మైలేజ్‌ తగ్గిపోతే కచ్చితంగా నిపుణులకు చూపించాలి. అలాగే కారు ఇంజిన్‌ నుంచి ఎక్కువగా సౌండ్‌ వస్తే కూడా ఇంజిన్‌లో ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలి. వీటితోపాటు కారు వీల్‌ అలైన్‌ మెంట్‌ విషంయలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. తేడా ఉంటే షెడ్డుకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల కారు లైఫ్‌టైమ్ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మీ కారు ఇంజన్ ఏంటి? - టర్బో ఛార్జర్ Vs సూపర్ ఛార్జర్​ - ఏది బెస్ట్?

కారుకు యాక్సిడెంట్ జరిగితే - ఏం చేయాలో తెలుసా?

మీ కారు ఈ సంకేతాలు ఇస్తుందా? - అయితే వీల్​ అలైన్​మెంట్​ ప్రాబ్లమ్​ ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.