ETV Bharat / bharat

మీ కారు ఈ సంకేతాలు ఇస్తుందా? - అయితే వీల్​ అలైన్​మెంట్​ ప్రాబ్లమ్​ ఉన్నట్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 11:57 AM IST

Signs of Car Wheel Alignment Repair : చాలా మంది కారు ఇంజిన్, సర్వీసింగ్, ఇంటీరియర్, ఇతరత్రా పరికరాల మెయింటెనెన్స్ విషయంలో తీసుకునే శ్రద్ధ వీల్ అలైన్​మెంట్ విషయంలో తీసుకోరు. కానీ, దానిని కూడా తరచుగా చెక్ చేయాలంటున్నారు నిపుణులు. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Car Wheel Alignment
Car Wheel Alignment

How to Find Car Wheel Alignment Problems : ప్రస్తుత రోజుల్లో వివిధ రవాణా అవసరాల రీత్యా ఎక్కువ మంది కారును కొంటున్నారు. లక్షలు పోసి కొన్న కారును సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే చాలా మంది ఇంజిన్, ఇంటీరియర్, ఫ్యూయల్ సేవింగ్​పై తీసుకునే శ్రద్ధ వీల్​ అలైన్​మెంట్ గురించి తీసుకోరు. అంటే వాహనం చక్రాల అమరిక విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. కాగా, కారుకి స్టీరింగ్ ఎంత ముఖ్యమో వీల్ అలైన్​మెంట్ కూడా అంతే కీలకం. ఇది కారును అదుపులో ఉంచడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది. కాబట్టి కారు వీల్​ అలైన్​మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే ఇంతకీ కారుకు వీల్​ అలైన్​మెంట్ ఎప్పుడు అవసరం? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సాధారణంగా మనం మంచి రోడ్లపై ప్రయాణించినప్పుడు వీల్​ అలైన్​మెంట్ పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, గుంతల పడిన రోడ్ల మీద వెళ్లేటప్పుడు ఇది పెను సవాలుగా మారుతుంది. ఇక ఈ సమస్య ఉన్న కార్లలో దాని పనితీరు, మైలేజ్, డ్రైవింగ్ విధానాలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే మీరు వాహనంలో భారీ వస్తువులను తీసుకెళ్లేటప్పుడు లేదా ఎత్తైన మలుపులు తిరిగేటప్పుడు వీల్ అలైన్​మెంట్ మారే అవకాశం ఉంటుంది. అదే విధంగా కొన్నిసార్లు కార్లను వేగంగా నడపడం, వేగంగా మలుపు తిప్పడం లేదా వాహనాలకు జరిగే ప్రమాదాలు వంటి కారణాల వల్ల కూడా వీల్ అలైన్‌మెంట్ ఏర్పడుతుంది. అయితే ఇది వాహనం రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు కారు వీల్​ అలైన్​మెంట్ చెక్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇక వీల్ అలైన్‌మెంట్ సమస్యను ఎలా గుర్తించాలంటే..

వైబ్రేట్ అవ్వడం : వీల్ అలైన్‌మెంట్ మారిన తర్వాత మీ కారులో వచ్చే మొదటి సంకేతం వాహనం చాలా వరకూ వైబ్రేట్ అవుతుండటం. వాహనం నడుపుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్​లకు ఈ సమస్య ప్రధాన కారణం కావొచ్చు.

కారు వన్​సైడ్ లాగడం : మీ కారులో వీల్ అలైన్​మెంట్ సమస్య వచ్చిందని తెలిపే మరో సంకేతం వాహనం ఒకవైపు లాగుతున్నట్లు అనిపించడం. మీరు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా అనిపించినా తప్పనిసరిగా వీల్ అలైన్‌మెంట్​ను చెక్ చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

వంగినట్లుగా అనిపించడం : రోడ్డుపై కారు నడుపుతున్నప్పుడు వాహనం స్టీరింగ్​ని నిటారుగా పట్టుకున్నా అది నేరుగా వెళ్లకుండా కాస్త వంగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది కూడా కారు వీల్​ అలైన్​మెంట్ చేయించడం తప్పనిసరి అని తెలిపే సంకేతం. ముఖ్యంగా మీ వాహనం వీల్ అలైన్‌మెంట్ ఈ విధంగా మారినట్లయితే.. వెంటనే సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లి వీల్ అలైన్‌మెంట్‌ను రిపేర్ చేసుకోవాలి. లేదని నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

  • ఓ అధ్యయనం ప్రకారం.. కారు వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకుంటే వాహనం మైలేజ్ కూడా దాదాపు 7 శాతం తగ్గుతుందట.
  • కారును ఎప్పుడు వీల్ అలైన్​మెంట్ చేయించాలంటే.. కొత్తగా కారును కొనుగోలు చేసినట్లయితే సాధారణంగా దానిని కొనప్పటి నుంచి కనీసం 2-3 సంవత్సరాలలోపు ఒక్కసారైనా వీల్ అలైన్‌మెంట్ చేయించడం మంచిది. కారు కండీషన్​ మంచిగా ఉన్నా సరే.. వీల్​ అలైన్​మెంట్​ చేయించడం ముఖ్యం.
  • ఇక మీరు కారు వీల్ అలైన్‌మెంట్ చేయించేటప్పుడు టైర్ రొటేషన్ కూడా చేయించినట్లయితే, టైర్ల జీవితకాలం కూడా మెరుగుపడుతుంది.

రాత్రివేళ​ కారు హెడ్​లైట్స్ సరిగ్గా వెలగట్లేదా? - ఈ టిప్స్ పాటించారంటే ఫుల్ లైటింగ్!

మీ కారు "గ్యారేజ్​కు దారెటు భయ్యా?" అంటోందా - ఇవి చెక్ చేయకుంటే అంతేమరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.